Apple: ఫాక్స్‌కాన్ చైనా టెక్నీషియన్స్ వెనక్కి.. సమస్య పరిష్కారానికి ఆపిల్ ప్లాన్స్..

Apple: ఫాక్స్‌కాన్ చైనా టెక్నీషియన్స్ వెనక్కి.. సమస్య పరిష్కారానికి ఆపిల్ ప్లాన్స్..

Foxconn Issue: భారతదేశంలో ఉన్న తమ టెక్నీషియన్లను వెంటనే వెనక్కి రావాలంటూ చైనా ప్రభుత్వం చేసిన ప్రకటన కొత్త సమస్యలకు దారితీసింది. భారత్ లోని ఫాక్స్ కాన్ ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తి కేంద్రాల్లో ఈ చర్య పెద్దగా ఇబ్బందులు కలిగించటం లేదని తేలింది. అయితే ఈ పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని వెల్లడైంది. ఉత్పత్తి టార్గెట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నట్లు ఒక అధికారి వెల్లడించారు.

అయితే ఆపిల్ సంస్థ భారత ప్లాంట్లలో ఉత్పత్తి ఆటంకాలను తొలగించేందుకు అనేక మార్గాలను కలిగి ఉందని తెలుస్తోంది. అవసరమైన నిపుణులను ఇతర దేశాల నుంచి రప్పించుకునేందుకు వీలుగా వారి వీసాలను వేగంగా ప్రాసెసింగ్ చేసి అండగా నిలుస్తామని ప్రభుత్వ అధికారి వెల్లడించారు. చైనా ఉద్యోగులు వెనక్కి వెళ్లాలనుకోవటం కంపెనీకి వారికి మధ్య విషయంగా పేర్కొన్నారు. అయితే ఈ సమస్య ద్వారా దేశీయంగా నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను సిద్ధం చేసుకోవటంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సంస్థ భావిస్తోంది.

ALSO READ : స్కాన్ చెయ్యి.. పేమెంట్ కొట్టు.. UPI వాడకంలో తెలంగాణ దూకుడు.. ఏపీ వెనకంజ

చైనా చేస్తున్న పనులు తాత్కాలికంగా ఆపిల్ ఐఫోన్ల ఉత్పత్తిని నెమ్మదింప చేయవచ్చని తెలుస్తోంది. ఫాక్స్ కాన్ ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 17 ప్రో సిరీస్ ఉత్పత్తిని ఇండియాలో చేపడుతోంది. అయితే వీటి ఉత్పత్తి ఆలస్యం కంపెనీకి నష్టాలను కలిగించే ప్రమాదం ఉందని తెలుస్తోంది. చైనా తన చర్యల ద్వారా ఉత్పత్తిని ఆలస్యం చేయటం, కీలక మెషినరీ ఆలస్యాలు ఆపిల్ ఐఫోన్ల తయారీకి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో ఆపిల్ ఉత్పత్తుల తయారీకి 40వేల మంది పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో ఫాక్స్ కాన్ తన హైదరాబాదు యూనిట్ లో ఐపాడ్స్ తయారీని ప్రారంభించింది.