- భర్తతో కలిసే ప్లాన్
- దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు
పద్మారావునగర్, వెలుగు: డాక్టర్‌గా నటిస్తూ.. యశోద ఆస్పత్రిలో రోగుల నుంచి 11 తులాల బంగారు ఆభరణాలు దొంగతనం చేసిన ఫార్మ్- డి స్టూడెంట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మీడియాకు వివరాలు వెళ్లడించారు. నిందితురాలు గౌండ్ల శిరీష ఫార్మ్ -డి విద్యార్థిని. ఆర్థిక ఇబ్బందుల తో సులభంగా డబ్బు సంపాదించాలనుకుంది. ఇందుకు తన భర్త ఎడులపల్లి సాయికుమార్ గౌడ్ తో కలిసి ప్లాన్ వేసింది.
డాక్టర్‌గా నటిస్తూ వివిధ ఆస్పత్రుల్లోకి వెళ్లేది. వృద్ధ మహిళా రోగులను లక్ష్యంగా చేసుకునేది. తానే డాక్టర్ అంటూ రోగి ఆరోగ్య పరిస్థితి ఆరాతీసేది, ట్రీట్మెంట్ చేస్తానని నమ్మించి, బంధువులను బయటకు పంపేది. అనంతరం వెంట తెచ్చుకున్న ‘డయాజెపామ్’ మత్తు ఇంజక్షన్‌ను బాధితులకు ఇచ్చేది. రోగి స్పృహ కోల్పోయాక.. బంగారు ఆభరణాలను తీసుకొని పరారయ్యేది. మార్చి 11న సికింద్రాబాద్‌లోని యశోద, అంతకుముందు చందానగర్‌లోని సిటిజన్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చోరీలు చేసింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను పట్టకొని, బంగారు ఆభరణాలు, ఒక కారు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. --
