హైదరాబాద్, వెలుగు: ఏపీ రాజకీయంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని, ఏపీ కూటమి తమకొద్దని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అన్నారు. ప్రజల చేత ఎన్నికైన ప్రతినిధులు అసెంబ్లీ సాక్షిగా డ్రగ్ టెస్ట్ కు ముందుకురావాలన్నారు. మంగళవారం ఆయన బీజేఎల్పీ ఆఫీసులో మీడియాతో చిట్ చాట్ చేశారు."
ఆంధ్ర నేతలు తెలంగాణకు వచ్చి ఏదో చేస్తే రాష్ట్ర బీజేపీకి ఏం సంబంధం? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్ టెస్ట్ చేయించుకునే దుమ్ము ఉందా? డ్రగ్ టెస్ట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి కూడా రావాలి. డ్రగ్ టెస్ట్ కు నేను కూడా సిద్ధం.యంగ్ ఇండియన్ స్కూల్స్ కు అప్పు ఇప్పించింది కేంద్రమే. దమ్ముంటే దీనిపై మంత్రి శ్రీధర్ బాబు చర్చకు రావాలి. సీఎంకు దమ్ముంటే అక్రమ ఫామ్ హౌస్ లను కూల్చాలి. రాష్ట్రంలో ఫామ్ హౌస్ కల్చర్ తెచ్చిందే బీఆర్ఎస్" అని పేర్కొన్నారు.
