న్యూఢిల్లీ: ఇండియాతో జరగనున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్ తగిలింది. గాయాల కారణంగా స్టార్ బ్యాటర్ టోనీ డి జోర్జీ, యువ పేసర్ క్వేనా మఫాకా టీ20 సిరీస్‌కు పూర్తిగా దూరమైనట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది.
‘‘భారత్‌తో మంగళవారం (డిసెంబర్ 9) నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌కు గాయం కారణంగా టోనీ డి జోర్జీ దూరమయ్యాడు. జట్టును వీడి అతను తిరిగి స్వదేశానికి వస్తాడు. అతని స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదు’’ అని క్రికెట్ దక్షిణాఫ్రికా పేర్కొంది. అలాగే.. యంగ్ పేసర్ క్వేనా మఫాక కూడా జట్టు నుండి విడుదల అయ్యాడు. అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉంటాడని తెలిపింది.
2025, డిసెంబర్ 4న రాయ్‌పూర్ వేదికగా ఇండియా, సౌతాఫ్రికా మధ్య రెండో వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో స్టార్ బ్యాటర్ టోనీ డి జార్జ్ గాయపడ్డాడు. నొప్పితో విలవిలలాడిన టోనీ బ్యాటింగ్ చేయలేక రిటైర్డ్ హార్ట్‌గా గ్రౌండ్‌ను వీడాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేతో పాటు 5 మ్యాచుల టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టోనీ డీ జార్జ్ దూరం కావడం సౌతాఫ్రికాకు భారీ ఎదురు దెబ్బే.
డిసెంబర్ 9 నుంచి టీ20 సిరీస్:
ప్రస్తుతం వన్డే సిరీస్‌లో తలపడుతోన్న ఇండియా, సౌతాఫ్రికా జట్లు డిసెంబర్ 9 నుంచి టీ20 సిరీస్ ఆడనున్నాయి. డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. డిసెంబర్ 9న కటక్ వేదికగా తొలి టీ20.. డిసెంబర్ 11 న్యూ చండీగఢ్ వేదికగా రెండో టీ20.. డిసెంబర్ 14న ధర్మశాల వేదికగా మూడో టీ20.. డిసెంబర్ 17న లక్నో వేదికగా నాలుగో టీ20.. డిసెంబర్ 19న అహ్మదాబాద్ లో ఐదో టీ20 జరుగుతాయి. టీ20 మ్యాచ్‌లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి.
దక్షిణాఫ్రికా T20I జట్టు:
ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్ (WK), డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్ , డేవిడ్ మిల్లర్, జార్జ్ లిండే, లుంగీ ఎంగిడి , అన్రిచ్ నార్ట్జే, లూథోస్తాబ్‌లాబ్స్
►ALSO READ | IND vs SA: సౌతాఫ్రికాతో మూడో వన్డే.. రిషబ్ పంత్ కాకుండా తిలక్ వర్మకు ఛాన్స్.. రెండు కారణాలు ఇవే!
