సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేస్తోంది. నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. శనివారం (డిసెంబర్ 6) విశాఖపట్నం వేదికగా డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా ప్లేయింగ్ 11 లో ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ స్థానంలో లోకల్ ప్లేయర్ తిలక్ వర్మకు తుది జట్టులో అవకాశం వచ్చింది. రిషబ్ పంత్ లాంటి మ్యాచ్ విన్నర్ ఉన్నప్పటికీ తిలక్ వర్మకు ఛాన్స్ ఇవ్వడానికి రెండు కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఆరో బౌలర్ గా అవకాశం:
కీలకమైన మూడో వన్డేలో వాషింగ్ టన్ సుందర్ ను పక్కన పెట్టడంతో టీమిండియా ఈ మ్యాచ్ లో ఐదుగురు బౌలర్లతోనే ఆడుతోంది. తిలక్ వర్మకు ఛాన్స్ ఇస్తే ఆరో బౌలర్ గా జట్టుకు ఉపయోగపడతాడు. తిలక్ ఆల్ రౌండర్ కాకపోయినా పార్ట్ టైమ్ బౌలర్. దేశవాళీ క్రికెట్ లో.. ఐపీఎల్ లో బౌలింగ్ వేసిన అనుభవం ఉంది. రిషబ్ పంత్ ను తీసుకుంటే ఇండియాకు ఐదుగురు బౌలింగ్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఈ కారణంగానే పంత్ ని పక్కన పెట్టి తిలక్ ను ప్లేయింగ్ 11 లో తీసుకోవాల్సి వచ్చింది.
ALSO READ : ఇండియాకు గుడ్ స్టార్ట్..
లోకల్ ప్లేయర్:
తిలక్ వర్మకు విశాఖపట్నం హోమ్ గ్రౌండ్. మ్యాచ్ ప్రస్తుతం విశాఖపట్నం వేదికగా డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. సొంతగడ్డపై తిలక్ అనుభవాన్ని టీమిండియా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇక్కడ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అనుభవం ఈ తెలుగు కుర్రాడికి ఉంది. ఇటీవలే ఆసియా కప్ ఫైనల్లో ఒంటరి పోరాటం చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. మిడిల్ ఆర్డర్ లో స్ట్రైక్ రొటేట్ చేయగలడు. దీంతో పంత్ కు నిరాశ తప్పలేదు.
విశాఖ బ్యాటింగ్ కు అనుకూలం:
విశాఖపట్నంలో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం. డ్యూ ఫ్యాక్టర్ కారణంగా ఛేజింగ్ చేసిన జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తొలి రెండు వన్డేల్లో బౌలింగ్ విభాగాల్లో విఫలమైన టీమిండియా ఈ మ్యాచ్ లో ఆ తప్పు రిపీట్ చేయకుండా ఉంటేనే సిరీస్ గెలుస్తుంది. టెస్ట్ సిరీస్ గెలిచి ఊపు మీదున్న సఫారీలు వన్డే సిరీస్ కైవసం చేసుకొని ఈ టూర్ ను చిరస్మరణీయం చేసుకోవాలని భావిస్తోంది.
భారత్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్, కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI):
ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్రామ్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్
