టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం తన తండ్రి అనారోగ్యం కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. పలాష్ ముచ్చల్ తో స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడడడంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వివాహం ఆగిపోవడం.. స్మృతి మంధాన వివాహ ఫోటోలను తొలగించడంతో పలాష్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ప్రజలు స్మృతిని మోసం చేశాడనే ఆరోపణలు చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఇది పూర్తిగా అవాస్తవం అని తెలుస్తోంది. వివాహాన్ని రద్దు చేయాలనే నిర్ణయం రెండు కుటుంబాలు పరస్పరం తీసుకున్నట్టు అర్ధమవుతోంది. పలాష్ ముచ్చల్ సోదరి పాలక్ ముచ్చల్ స్మృతి, పలాష్ వివాహం తర్వాత తొలిసారి మాట్లాడింది.
ఫిల్మ్ ఫేర్ లో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది.." వివాహం ఆగిన తర్వాత రెండు కుటుంబాలు చాలా కఠిన పరిస్థితులు ఎదర్కొంటున్నాయి. ఇలాంటి కష్టకాలంలో పాజిటీవ్ గా ఉండాలని నేను నమ్ముతున్నాను. నేను మళ్ళీ చెబుతున్నాను మా కుటుంబాలు స్ట్రాంగ్ గా ఉండేందుకు వీలైనంత పాజిటివ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తాం". అని సింగర్ పాలక్ ముచ్చల్ చెప్పుకొచ్చారు. నవంబర్ 23న జరగాల్సి వీరి వివాహం న్యూయర్ తర్వాత జరగనున్నట్టు వార్తలు వస్తున్నాయి. నవంబర్ 20న ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టు స్మృతి కన్ఫర్మ్ చేసింది. టీమిండియా ప్లేయర్స్ తో ఒక రీల్ ద్వారా తన చేతికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ పలాష్ ముచ్చల్‌తో నిశ్చితార్ధం జరిగినట్టు క్లారిటీ ఇచ్చింది.
►ALSO READ | Ashes 2025-26: యాషెస్ టెస్ట్ కాదు వన్డే: రెండో టెస్టులో రెచ్చిపోయి ఆడుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా
నవంబర్ 23న జరగాల్సిన ఆమె వివాహం చేసుకోవాల్సి ఉంది. ఆ రోజు మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆమె పెళ్లి వేడుకలు నేడు గ్రాండ్ గా నిర్వహించారు. వివాహానికి ముందు మెహందీ వేడుకను నిర్వహించారు. ఈ సెలెబ్రేషన్ లో చాలామంది మహిళా క్రికెటర్లు సందడి చేస్తూ కనిపించారు. అయితే మంధాన తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండడంతో పెళ్లి వాయిదా వేయక తప్పలేదు. ఆ రోజు స్మృతి తండ్రి అల్పాహారం తీసుకుంటున్నప్పుడు ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆయన కోలుకుంటారని భావించినా పరిస్థితి క్షీణించింది. పరిస్థితి మరింత దిగజారడంతో మేము అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Mad Mad Respect for Smriti, Keeping Poise and Calm through the toughest phase of her life.
— Jalebi Justice 🍥 (@PleadingPretty) December 5, 2025
Meanwhile Palak Muchhal:pic.twitter.com/LhfzGCfPYD
