Ashes 2025-26: యాషెస్ టెస్ట్ కాదు వన్డే: రెండో టెస్టులో రెచ్చిపోయి ఆడుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా

Ashes 2025-26: యాషెస్ టెస్ట్ కాదు వన్డే: రెండో టెస్టులో రెచ్చిపోయి ఆడుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ లభిస్తోంది. ఎవరూ తగ్గేదే లేదన్నట్టుగా చెలరేగి ఆడుతున్నారు. ఆడుతుంది టెస్ట్ కాదు వన్డే అన్నట్టు ఒకరిని మించి మరొకరు దూకుడుగా ఆడుతున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 5 రన్ రేట్ తో బ్యాటింగ్ చేసి ఆశ్చర్యానికి గురి చేస్తే సొంత గడ్డపై మేము కూడా తగ్గేదే లేదన్నట్టు ఆస్ట్రేలియా అంతకు మించి అగ్రెస్సివ్ గా బ్యాటింగ్ చేస్తూ ఫ్యాన్స్ కు ఫీస్ట్ అందించింది. తొలి రోజు ఇంగ్లాండ్ వేగంగా ఆడితే.. రెండో రోజు ఆసీస్ ఆధిపత్యాన్ని చూపించింది. 

బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. క్రీజ్ లో అలెక్స్ క్యారీ (45), మైకేల్ నజీర్ (15) ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యంలో ఉన్నారు. చేతిలో నాలుగు వికెట్లు ఉండడంతో ఆసీస్ చేతిలోనే మ్యాచ్ ఉంది. ఇంగ్లాండ్ ను ఆలౌట్ చేసి రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించింది. జేక్ వెదరాల్డ్, ట్రావిస్ హెడ్ తొలి వికెట్ కు 13 ఓవరాల్లోనే 77 పరుగులు జోడించారు. కాసేపాటికీ వీరిద్దరూ ఔటైనా  లబుషేన్, స్మిత్ కలిసి ఇన్నింగ్స్ వేగం తగ్గకుండా చూశారు. ఓ వైపు వికెట్ కాపాడుకుంటూనే మరోవైపు దూకుడుగా ఆడారు. 

►ALSO READ | 2027 ODI World Cup: 2027 వన్డే వరల్డ్ కప్ టాప్-4 ఎవరో చెప్పిన అశ్విన్.. ఏకంగా కెప్టెన్‌నే పక్కన పెట్టాడు

వీరిద్దరి తర్వాత వచ్చిన గ్రీన్, క్యారీ కూడా 80 పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడం విశేషం. దీంతో రెండో రోజు ఆస్ట్రేలియా 73 ఓవరాల్లోనే 378 పరుగులు చేసింది. అంతకముందు తొలి రోజు ఇంగ్లాండ్ కూడా ఫాస్ట్ గా ఆడింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా వచ్చినవారు వచ్చినట్టు బ్యాట్ ఝులిపించారు. జట్టులోని ప్రతి ఒక్కరూ 60 పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు రాబట్టారు. రూట్ (138) సెంచరీతో పాటు క్రాలీ (76) హాఫ్ సెంచరీ చేయడంతో ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 334 పరుగులకు ఆలౌట్ అయ్యారు. 74 ఓవర్లలోనే ఇంగ్లాండ్ ఈ స్కోర్ కొట్టడం విశేషం. మిచెల్ స్టార్క్ కు 6 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల జోరు చూస్తుంటే మ్యాచ్ ఐదో రోజుకు వెళ్లడం అనుమానంగానే కనిపిస్తోంది.