రూ.60వేలు లంచం తీసుకుంటూ..ఏసీబీకి చిక్కిన హనుమకొండ అదనపు కలెక్టర్

రూ.60వేలు లంచం తీసుకుంటూ..ఏసీబీకి చిక్కిన హనుమకొండ అదనపు కలెక్టర్

అవినీతి, అక్రమాస్తులు, లంచం కేసుల్లో రోజుకో ఉన్నతాధికారి పట్టుబడుతున్నారు. నిన్న రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు చిక్కాడు.. తాజాగా హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఏసీబీ అధికారులు పట్టుబడటం కలకలం రేపుతోంది.. కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి లంచం తీసుకుంటూ పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. 

శుక్రవారం(డిసెంబర్5) హనుమకొండ కలెక్టరేట్ లో రైడ్స్ చేసిన ఏసీబీ అధికారులు.. ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ చేసేందుకు సంస్థ యాజమన్యం నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో  హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. వెంకట్ రెడ్డి  ప్రస్తుత హనుమకొండ డీఈవోగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ కోసం లంచం డిమాండ్ చేసి రూ. 60 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

గురువారం రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. సుమారు వంద కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు. అక్రమాస్తుల కేసులో ఏసీబీ ఆయనపై పలు కేసులు నమోదు చేశారు ఏసీబీ అధికారులు.