IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్.. రూ.2 కోట్ల బేస్-ప్రైస్ ఆటగాళ్లు వీరే.. ఇండియా నుంచి ఇద్దరు

IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్.. రూ.2 కోట్ల బేస్-ప్రైస్ ఆటగాళ్లు వీరే.. ఇండియా నుంచి ఇద్దరు

ఐపీఎల్ 2026 మినీ వేలంలో రూ.2 కోట్ల బేస్-ప్రైస్ కలిగిన ఆటగాళ్లపై అందరి దృష్టి నిలవనుంది. కామెరాన్ గ్రీన్, లియామ్ లివింగ్‌స్టోన్, వనిందు హసరంగా, మతీషా పతిరానా, గెరాల్డ్ కోట్జీ, డెవాన్ కాన్వే వంటి ఆటగాళ్లు ఈ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. మొత్తం 45 మంది ఆటగాళ్ల బేస్ ధరను రూ.2 కోట్ల జాబితాలో ఉన్నారు. వీరిలో ఇద్దరు ఇండియన్ ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. 43 మంది విదేశీ ఆటగాళ్లు పోటీలో నిలిచారు. ఐపీఎల్ మినీ యాక్షన్ డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది. నవంబర్ 30న రిజిస్ట్రేషన్ విండో ముగిసిన తర్వాత ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం రికార్డు స్థాయిలో 1,355 మంది ఆటగాళ్లు తమ పేరును నమోదు చేసుకున్నారు. 

2 కోట్ల కేటగిరీలో ఇద్దరు భారత ఆటగాళ్లు:

ఇద్దరు భారత ఆటగాళ్లు మాత్రమే రూ.2 కోట్ల ప్రాథమిక ధరతో వేలల్లోకి రానున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్. ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా  ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ జాక్ పాట్ కొట్టిన సంగతి తెలిసిందే. అతన్ని కోల్‎కతా  నైట్ రైడర్స్ ఏకంగా రూ.23.75 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. అయ్యర్ గత నాలుగు ఐపీఎల్ సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో కీలక పాత్ర పోషించాడు. 2021లో జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలోనూ.. 2024 సీజన్‌లో ఆ జట్టు ట్రోఫీ ముద్దాడడంలోనూ తనవంతు సహకారం అందించాడు. అయితే 2025 లో ఘోరంగా విఫలం కావడంతో అతడిని కేకేఆర్ రిలీజ్ చేసింది. 

లక్నో సూపర్ జయింట్స్ జట్టు స్పిన్నర్ రవి బిష్ణోయ్ ని రిలీజ్ చేసింది. 2025 ఐపీఎల్ సీజన్ లో బిష్ణోయ్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు. ఆడిన 11 మ్యాచ్ ల్లో 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఎకానమీ 10 కి పైగా ఉండడంతో అతడిని లక్నో జట్టు రిలీజ్ చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ తో రానున్న బిష్ణోయ్ ఈ సారి ఏ జట్టుకు వెళ్తాడో ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2025 లో బిష్ణోయ్ ని రూ. 11 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకోగా.. ఘోరంగా విఫలమయ్యాడు.    

బేస్ ప్రైస్ 2 కోట్లు:

ఇండియా: రవి బిష్ణోయ్, వెంకటేష్ అయ్యర్

ఆఫ్ఘనిస్తాన్: ముజీబ్ ఉర్ రెహమాన్, నవీన్ ఉల్ హక్

ఆస్ట్రేలియా: సీన్ అబోట్, అష్టన్ అగర్, కూపర్ కొన్నోలీ, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, స్టీవ్ స్మిత్

బంగ్లాదేశ్: ముస్తాఫిజుర్ రెహమాన్

ఇంగ్లాండ్:

గుస్ అట్కిసన్, టామ్ బాన్ టన్, టామ్ కరణ్, లియాం డాసన్, బెన్ డకెట్, డాన్ లారెన్స్, లియామ్ లివింగ్‌స్టోన్, టైమల్ మిల్స్, జామీ స్మిత్, ఫిన్ అలెన్

న్యూజిలాండ్:

మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కెట్, రచీన్ రవీంద్ర,

సౌతాఫ్రికా: కొయెట్జి, లుంగీ ఎంగిడి, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్ట్జే, రిలీ రౌసౌ, తబ్రైజ్ షమ్సీ

నమీబియా: డేవిడ్ వైస్

శ్రీలంక: వనిందు హసరంగా, మతీషా పతిరణ, మహేశ్ తీక్షణ

వెస్టిండీస్:జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్