టాలీవుడ్ సినిమాలకు షాకుల మీద షాకులు.. మొన్న అఖండ 2.. ఇప్పుడు ‘ది రాజా సాబ్’ !

టాలీవుడ్ సినిమాలకు షాకుల మీద షాకులు.. మొన్న అఖండ 2.. ఇప్పుడు ‘ది రాజా సాబ్’ !

టాలీవుడ్ సినిమాలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అఖండ 2 సినిమా విడుదలపై వివాదం నడుస్తుండగా తాజాగా ప్రభాస్ రాజాసాబ్ గురించి ఒక బ్యాడ్ న్యూస్ తెలిసింది. ‘ది రాజా సాబ్’ సినిమా హారర్ జానర్లో విజువల్ వండర్గా తెరకెక్కుతోంది. ఇలాంటి విజువల్ బేస్డ్ సినిమాలను ఐమ్యాక్స్ ఫార్మాట్లో చూస్తే వచ్చే ఫీల్ వేరె లెవెల్ ఉంటుంది. ‘ది రాజా సాబ్’ సినిమాను ఐమ్యాక్స్ ఫార్మాట్లో కూడా విడుదల చేయాలని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భావించింది.

అయితే.. ‘ది రాజా సాబ్’ సినిమా IMAX ఫార్మాట్లో విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు. అందుకు అవతార్3 సినిమానే కారణం. అవతార్3 సినిమా డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇలాంటి సినిమాను IMAXలో 3Dలో చూసేందుకే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికే అవతార్3 సినిమా కోసం.. ఈ సినిమా దర్శకుడు జేమ్స్ కామెరూన్ IMAX కార్పొరేషన్తో నాలుగు వారాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది.

దీంతో.. IMAX స్క్రీన్స్ అన్నింటిలో డిసెంబర్ 19 నుంచి నాలుగు వారాల పాటు.. అంటే దాదాపు జనవరి 16 లేదా 17, 2026 వరకూ అవతార్3 సినిమానే ప్రదర్శించాలనేది డీల్. ‘ది రాజాసాబ్’ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 09న విడుదల కానుంది. ఈ సినిమా విడుదలైన దాదాపు పది రోజుల దాకా IMAX ఫార్మాట్లో ఈ సినిమాను ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ దాదాపుగా లేనట్టే. సో.. ‘ది రాజాసాబ్’ ఐమ్యాక్స్ ఫార్మాట్లో విడుదలవడం కష్టమే.

PLF, DBOX.. ఇతర ఫార్మాట్స్లో ఈ సినిమాను వీక్షించి ఆస్వాదించవచ్చు. ప్రభాస్ అభిమానులకు, IMAX ఫార్మాట్లో ఈ సినిమాను ఆస్వాదించాలని ఆశించిన ప్రేక్షకులకు ఈ వార్త కొంచెం మింగుడు పడని విషయమని చెప్పక తప్పదు.