IPL 2026: నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడగలను.. మినీ ఆక్షన్ ముందు బీసీసీఐకి ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ రిక్వెస్ట్

IPL 2026: నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడగలను.. మినీ ఆక్షన్ ముందు బీసీసీఐకి ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ రిక్వెస్ట్

ఐపీఎల్ మినీ యాక్షన్ కు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది. నవంబర్ 30న రిజిస్ట్రేషన్ విండో ముగిసిన తర్వాత ఐపీఎల్ 2026 మినీ-వేలం కోసం రికార్డు స్థాయిలో 1,355 మంది ఆటగాళ్లు తమ పేరును నమోదు చేసుకున్నారు. ఈ సారి మినీ ఆక్షన్ లో అందరి దృష్టి విదేశీ ఆటగాళ్లపైనే ఉంది. 43 మంది విదేశీ ఆటగాళ్లు వేలంలో తమ పేరును నమోదు చేసుకున్నారు. వీరిలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ వైపు అందరి చూపు నెలకొంది. గ్రీన్ తో పాటు పవర్ ఫుల్ హిట్టర్ జోష్ ఇంగ్లిస్ రేస్ లో ఉన్నాడు. అయితే ఇంగ్లిస్ ను ఐపీఎల్ లో ఏ ఫ్రాంచైజీ కొనే అవకాశాలు లేనట్టు సమాచారం. 

ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుతంగా ఆడిన జోష్ ఇంగ్లిస్ ను రిటైన్ చేసుకోలేదు. బుమ్రా బౌలింగ్ లో సిక్సలు కొట్టి  ఆధిపత్యం చూపించినా.. ఎన్నో మ్యాచ్ ల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు ఆడినా ఇంగ్లిస్ ను రిలీజ్ చేయడానికి కారణం లేకపోలేదు. ఐపీఎల్ 2026 లో ఇంగ్లిస్ కేవలం 25 శాతం లేదా దాదాపు నాలుగు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటానని బీసీసీఐకి తెలిపాడు. ఇంగ్లిస్ ఈ నిర్ణయం తీసుకోవడంలో కారణం లేకపోలేదు. ఐపీఎల్ సమయంలో తన వివాహం ఉన్న కారణంగా అన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉండనని ముందే ధృవీకరించాడు. 

మినీ ఆక్షన్ లో ఈ ఆసీస్ బ్యాటర్ రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ తో ఆక్షన్ లో రానున్నాడు. ఇంగ్లిస్ ప్రస్తుతం యాషెస్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఆక్షన్ లో ఇంగ్లిస్ ను ఏ ఫ్రాంచైజీ కొనకపోవచ్చు. ఐపీఎల్ 2025 సీజన్ లో ఇంగ్లిస్ పంజాబ్ కింగ్స్ తరపున ఆడి తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. 11 మ్యాచ్ ల్లో 278 పరుగులు చేసి టాప్ ఆర్డర్ లో జట్టుకు కీలక ప్లేయర్ గా మారాడు. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ లో ముంబైపై ఆడిన ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచింది. ఐపీఎల్ 2025 సీజన్ లో ఈ ఆసీస్ బ్యాటర్ ను రూ 2.06 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.  


ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ ముందు పంజాబ్ కింగ్స్ రిటైన్ ప్లేయర్స్: 

అర్ష్దీప్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్ఓ, హర్నూర్ పన్ను, హర్‌ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గూసన్, మార్కో జాన్సెన్, మార్కస్ స్టోయినిస్ , మిచ్ ఓవెన్, ముషీర్ ఖాన్, నేహాల్ వధేరా, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, పైలా సురేశ్ ఆర్య, పైలా సురేశ్ ఆర్య, పైలా సింగర్ అవీనాష్ షెడ్జ్, విష్ణు వినోద్, వైషాక్ విజయ్కుమార్, జేవియర్ బార్ట్లెట్, యష్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్