బాలకృష్ణ నటించిన "అఖండ 2 సడెన్గా వాయిదా పడి ఎంతోమందిని ఆశ్యర్యపరిచింది.. నిరాశపరిచింది" ఇది సగటు సినీ అభిమాని మాట. మరోవైపు, అఖండ 2 మూవీ.. " డైరెక్ట్ or ఇన్ డైరెక్ట్గా ఎంతో మందిని నష్ట పరిచిందని" సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.
ఎందుకంటే, ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసింది కేవలం అభిమానులు మాత్రమే కాదు. సినిమాలపై ఇష్టం ఉండి బిజినెస్ చేయాలనుకున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా. ఇలా 14 రీల్స్ నిర్మాతల ఆర్ధిక లావాదేవీల కారణంగా సినిమా ఆగిపోవడం.. అందరినీ తీవ్ర నష్టాల్లో పడిసేందని సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ సోషల్ మీడియా వేదికగా ఒక బహిరంగ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు నట్టి కుమార్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఆయన మాటల్లోనే.. "అఖండ 2 నిర్మాతలకు మరియు చిత్రబృందానికి విజ్ఞప్తి. అఖండ 2 రిలీజ్ జరగకపోవడం పూర్తిగా ఎవ్వరూ ఊహించని విషయం. దీని వలన అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. తాను కేవలం తన ఒక్కడి కోసమే కాకుండా, తనతో మాట్లాడి బాధను పంచుకున్న ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్ల తరపున ఈ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. అందరి గొంతుకగా మారి ఆయన నిర్మాతల ముందు ఒక డిమాండ్ ఉంచారు.
►ALSO READ | Akhanda 2 Update: ‘అఖండ 2’ రిలీజ్ డేట్పై కొత్త అప్డేట్..
ఈ క్రమంలోనే సినిమా వాయిదా పడటంతో పాటు, కొత్త రిలీజ్ డేట్ కూడా ఖరారు కాకపోవడం వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలు మరింత పెరిగాయి. ఎందుకంటే ఈ సినిమా కోసం బయ్యర్లు, ఎగ్జిబిటర్లు చెల్లించిన మొత్తం అడ్వాన్సుల రూపంలో దాదాపు 100 కోట్లకు పైగానే ఉంటుందని నట్టి కుమార్ వెల్లడించారు. అంతేకాకుండా ఆ మొత్తాలపై భారీ వడ్డీలు చెల్లించాల్సి రావడం వంటి కారణాల వల్ల వారికి తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ఏర్పడింది. వారి పరిస్థితి, వారి బాధను కూడా మనం అర్ధం చేసుకోవాలి.
అందువల్ల ఈ క్లిష్ట పరిస్థితుల్లో, దయచేసి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు చెల్లించిన మొత్తాన్ని రేపటిలోగా రీఫండ్ (వెనక్కి ఇవ్వడం) చేయాలని కోరారు. రీఫండ్ చేస్తే వారికి ఒక పెద్ద ఉపశమనం లభిస్తుంది. ఇలా చేయడం ద్వారా మన తెలుగు సినీ పరిశ్రమ ఒకటిగా నిలబడి, ఒకరికి ఒకరం తోడుగా ఉంటామనే బలమైన సందేశాన్ని అందిస్తుంది. ఇది మన సంపూర్ణ ఐక్యతను చూపించే సందర్భకూడా అవుతుంది. ఇది నా వినమ్ర విజ్ఞప్తి, ధన్యవాదాలు" అని నట్టి కుమార్ తన లేఖ ద్వారా వివరించారు. మరి డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అయిన నట్టి కుమార్ చేసిన విజ్ఞప్తితో సినీ ఇండస్ట్రీ నుంచి నిర్మాతలు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
Natti Kumar - Press Note#Akhanda2Thaandavam #NandamuriBalakrishna #Akhanda2 #NandamuriBalakrishna #BoyapatiSreenu pic.twitter.com/fzhGzxoeCQ
— Natti kumar (@Nattikumar7) December 6, 2025
