విడుదలకు చివరి క్షణంలో వాయిదా పడ్డ ‘అఖండ 2’(Akhanda 2)పై కొత్త అప్డేట్స్ వినిపిస్తున్నాయి. బాలకృష్ణ అభిమానుల దగ్గరి నుంచి కామన్ సినీ ఆడియన్స్ వరకు.. అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 14 రీల్స్ నిర్మాతలు త్వరలోనే అఖండ 2 రీలిజ్ డేట్ ప్రకటిస్తామని ఇప్పటికే వెల్లడించారు.ఈ క్రమంలోనే ఫలానా తేదీలో అఖండ 2 వస్తుందంటూ కొత్త రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
‘ఏ క్షణంలో నైనా కొత్త డేట్ రావొచ్చు.. అన్నీ కుదిరితే డిసెంబర్ 19న మూవీ వచ్చే ఛాన్స్ ఉందని’ కొందరు అంటున్నారు. మరోవైపు క్రిస్మస్ సందర్భంగా వచ్చే ఛాన్స్ కూడా ఉందని ఇంకొందరు అంటున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఎవ్వరికీ నచ్చినట్లు వాళ్లు కొత్త తేదీలు అల్లుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే ఇండియా ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ అయిన బుక్ మై షో యాప్ (Book My Show)లో ఓ కొత్త అప్డేట్ కనిపిస్తోంది.
ALSO READ : కార్తి సినిమాకు కూడా అఖండ2 కష్టాలే..
అఖండ 2 వచ్చే ఏడాది (2026) రిలీజ్ కానున్నట్లు బుక్ మై షో సైట్లో చూపిస్తుంది. అంటే.. జనవరి 9 నుంచి జనవరి 16 మధ్యలో సంక్రాంతి స్పెషల్గా ఎప్పుడైనా రావొచ్చనే కొత్త టాక్ వినిపిస్తోంది. ఎందకంటే.. బాలకృష్ణ అంటేనే సంక్రాంతి సోగ్గాడు.. ఇప్పటికే ఎన్నో సినిమాలను పొంగల్ సందర్భంగా రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. ఇలా అఖండ 2తో 'పెద్ద పండుగకు.. మరింత పెద్ద జాతర' అని కొత్త చర్చ మొదలైంది.
ఇలా ఎన్ని తేదీలు బయటకొచ్చినప్పటికీ.. నిర్మాతలు వెల్లడించే ఫైనల్ తేదీనే ఫిక్స్..!! సో.. బాలయ్య ఫ్యాన్స్.. కొత్త డేట్ మరింత తొందరలోనే రావాలని కోరుకోవడమే.. ఇక వీలైతే ఆసక్తిగా ఎదురుచూడటమే!! ఎందుకంటే.. ఇప్పుడు సినిమా న్యాయపరమైన కేసులో చిక్కుకుంది. కనుక అన్నీ సమస్యలు పరిష్కారం అయితే తప్ప విడుదల కాలేని పరిస్థితి అఖండ 2 పేస్ చేస్తోంది. మరి ఏమవుతుందో చూడాలి!!
With a Blockbuster date very soon..#Akhanda2 https://t.co/LteJf8IRgZ
— raam achanta (@RaamAchanta) December 5, 2025
14 రీల్స్ నిర్మాతల ఆర్ధిక సమస్యలు:
శుక్రవారం (డిసెంబర్ 5న) విడుదల కావాల్సిన ‘అఖండ 2’ అనూహ్య పరిణామాల నడుమ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ప్లస్ సంస్థ తమకు రూ.28 కోట్ల బకాయి ఉందని, ఆ మొత్తం చెల్లించేవరకు సినిమాను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టులో బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ (Eros International Media Ltd) పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. రిలీజ్‌ను ఆపుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. విడుదలకు కొన్ని గంటల ముందు అఖండ2 సినిమా విడుదలకు అనుకోని ఆటంకం ఎదురైంది.
జస్టిస్ ఎస్ఎం సుబ్రమణ్యం, జస్టిస్ సి.కుమరప్పన్తో కూడిన మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పు వెలువరించింది. ఇక ఇప్పుడు మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ వెలువరించిన తీర్పు Eros సంస్థకు అనుకూలంగా రావడంతో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. పూర్తి ఆర్బిట్రల్ అవార్డు మొత్తం 27 కోట్ల 80 లక్షల 18 వేల 13 రూపాయలు.. 14 శాతం వడ్డీ ఈరోస్‌కు చెల్లిస్తేనే సినిమాను విడుదల చేయాలని అఖండ 2 విడుదలకు ముందు మద్రాస్ డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.
