డైరెక్టర్ కం యాక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) అంటే పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం తాను హీరోగా కశ్యప్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాయపడ్డ సింహం’(Gayapadda Simham). ‘నవ్వకండి.. ఇది చాలా సీరియస్ మేటర్’ అనేది ట్యాగ్‌లైన్. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తుండగా విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవన్ సాధినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మిస్తున్నారు.
అమెరికా వెళ్లాలనుకున్న ఓ యువకుడి డ్రీమ్.. అమెరికా అధ్యక్షుడు తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా ఎలా ఆగమయ్యిందో చెప్పే వినూత్న కథతో మూవీ తెరకెక్కతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు ఫన్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్ వీపరీతంగా ఆకట్టుకుంది.
ఈ క్రమంలోనే మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేసుకున్నట్లుగా సినీ వర్గాల సమాచారం. అంతేకాదు.. పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ బిజినెస్ చేసుకోవడంతో టాలీవుడ్లో టాక్ అఫ్ ది మూవీగా నిలిచింది.
రిలీజ్‌కు ముందే భారీ బిజినెస్
సినీ వర్గాల సమాచారం ప్రకారం గాయపడ్డ సింహం సుమారు రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి మంచి ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.
నాన్ థియేట్రికల్ హక్కులు: సుమారు రూ.9 కోట్లు
థియేట్రికల్ హక్కులు: సుమారు రూ.6 కోట్లు
మొత్తంగా విడుదలకు ముందే దాదాపు రూ.15 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇదే నిజమైతే నిర్మాతలు ఇప్పటికే సేఫ్ జోన్‌లోకి వెళ్లినట్టే అని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేవలం ప్రమోషనల్ కంటెంట్ ద్వారానే ఇంత బిజినెస్ జరగడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
►ALSO READ | Allu Arjun: భార్యకు బెంజ్.. తల్లికి లెక్సస్.. ఐకాన్ స్టార్ రియల్ హీరో అనిపించుకున్నాడుగా!
ఎందుకంటే, థియేటర్ లో రిలీజ్ అయ్యాక.. కంటెంట్ బాగున్నా పెట్టిన బడ్జెట్ రావట్లేదు. అలాంటిది. కేవలం ప్రమోషనల్ కంటెంట్ తోనే ఇది ఎలా సాధ్యమైందనే చర్చ నడుస్తుంది. ఏదేమైనా.. మొత్తానికి హీరోగా తరుణ్ భాస్కర్.. మరో మెట్టు ఎక్కినట్టే కనిపిస్తోంది. హీరోగా ఓ మెట్టు ఎక్కినట్టుగానే కనిపిస్తోంది. ఇక సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్ని పనులు పూర్తి చేసి ఏప్రిల్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కథను సూర్య ప్రకాష్ జోస్యుల అందించగా, సినిమాటోగ్రఫీని విద్యా సాగర్ చింత నిర్వహిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
