డిప్యూటీ సీఎం అయ్యుండి అవేం మాటలు: పవన్ దిష్టి కామెంట్స్‎పై ఉండవల్లి స్పందన

డిప్యూటీ సీఎం అయ్యుండి అవేం మాటలు: పవన్ దిష్టి కామెంట్స్‎పై ఉండవల్లి స్పందన

అమరావతి: గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని, కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. 

కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని పవన్ వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని చురకలంటించారు. ముఖ్యమంత్రి అవుతాడని నమ్మిన పవన్ కల్యాణ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు. 

ALSO READ : అందరినీ నవ్వించే సినీ నటుడు, పాస్టర్ జోసెఫ్ గుండెపోటుతో మృతి

చంద్రబాబు తన సొంత వ్యాపారాలు ఎందుకు తీసుకురావట్లే..?

పవన్ కల్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై స్పందించిన ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం చంద్రబాబుపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ నలుమూలల నుంచి ఆంధ్రప్రదేశ్‎కు పెట్టుబడులు తీసుకొస్తున్న సీఎం చంద్రబాబు.. తన వ్యాపారాలు ఎందుకు ఆంధ్రకు తీసుకురావడం లేదని సూటిగా ప్రశ్నించారు. అలాగే.. అమరావతిలో రాజధాని నిర్మాణానికి తాను వ్యతిరేకం కాదని.. రాజధాని కోసం అన్ని వేల ఎకరాలు ఎందుకనేదే నా ప్రశ్న అని అన్నారు.