చీమలు శ్రమ జీవులని అందరికీ తెలుసు. కానీ చీమలలో త్యాగం చేసే గుణం కూడా ఉంటుందట. తోటి చీమలకోసం ప్రాణత్యాగానికైనా సిద్దపడతాయట..మీరు బతకాలంటే నన్ను చంపేయండి.. అంటూ చీమలు ఇతర చీమలకు సంకేతాలు పంపిస్తాయట. ఈ విషయం ఇటీవల చీమలపై జరిపిన అధ్యయనాల్లో తెలిసింది. చీమల గురించి మరో సంచలన విషయం కూడా వెల్లడైంది. అదేంటంటే చీమలు గ్రేట్ సర్జన్స్. చీమలపై ఆస్ట్రియా పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో చీమల గురించి నమశక్యంగాని, ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటికొచ్చాయి.వివరాల్లోకి వెళితే..
గాయపడిన తోటి చీమలకు స్వతహాగా సర్జరీ చేసి నయం చేసే స్కిల్స్ ఉన్నాయని పరిశోధనల్లో రుజువైంది. అయితే తీవ్రంగా రోగాల బారిన చీమలు తమ జాతిని కాపాడుకోవడానికి ప్రాణ త్యాగా నికి కూడా వెనుకాడబోవని ఆసక్తికర విషయం తెలిసింది.
►ALSO READ | మీకు తెలుసా : ఏ జీవి ఎంత కాలం బతుకుతుందో.. ఒక్క రోజు నుంచి 500 ఏళ్లు బతికే జీవరాశులు ఇవే..!
జబ్బుపడ్డ చీమలు తనను చంపాలంటూ తమ శరీరం నుంచి ఒక రకమైన రసాయనిక వాయువును సందేశంగా తోటి చీమ లకు పంపిస్తాయని, ఆ సిగ్నల్స్ అందుకొన్న మిగతా చీమలు.. సదరు జబ్బు పడ్డ చీమను చంపేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెంది మిగతా చీమలు చనిపోకుండా ఉండేందుకే ఈ ప్రక్రియను బాధిత చీమలు అనుసరిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు.
సాధారణంగా చీమల్లో రాణి చీమ బలంగా ఉంటుందని కొన్ని సందర్భాల్లో చదువుకున్నాం.. ఈ విషయం కూడా పరిశోధకులు నిజమే తేల్చారు. రాణి చీమలకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, ఒకవేళ రాణి చీమ జబ్బు పడితే మిగతా చీమలు ఏం చేస్తాయనేదానిపై లోతుగా పరిశోధనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. చీమలపై ఆస్ట్రియా పరిశోధకులు జరిపిన అధ్యయనం వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ లో ప్రచురించారు.
