
శని మంచి.. చెడు పనుల ఫలితాలను నిర్ణయిస్తాడు, కర్మ ఫల దాత అనే బిరుదును సంపాదిస్తాడు. అందువల్ల శని తిరోగమనం లేదా ప్రత్యక్ష లు 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుందని పండితులు చెబుతున్నారు. అలాంటి శనిభగవానుడు రేపు జూలై 13న ఉదయం 7:24 గంటలకు మీన రాశిలో తిరోగమనం చెందుతాడు. ఇలానే 138 రోజులు అంటే నవంబర్ 28 వరకు కొనసాగుతాడు. శని మీనరాశిలో తిరోగమనం వల్ల ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. . .
నవగ్రహాల్లో శని న్యాయదేవత.. శని దృష్టి సక్రమంగా లేకపోతే జ్యోతిష్యం ప్రకారం వారు చాలా కష్టాలు పడతారు. కొంతమంది శనిభగవానుడు ఏలినాటి శని రూపంలో పట్టి పీడిస్తుంటాడు. శని అనుగ్రహం లేకపోతే జీవితంలో స్థిరత్వం ... ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.
మేష రాశి: మీన రాశిలో .. శని తిరోగమనం వలన ప్రతి శనివారం సుందరకాండ పారాయణం చేయడం వలన అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు నిర్ణయాలను చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు చాలా సమయం ఓపికగా ఉండాలి. విదేశీ ప్రయాణం.. వ్యాపారానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా మారతాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీనరాశిలో శని తిరోగమనంతో, ప్రతికూలత ప్రభావం తగ్గడంతో ..కొంత ఉపశమనం ఇస్తుంది.
వృషభ రాశి : ఈ రాశి వారు శనివారం శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి శివాలయంలో నల్ల నువ్వుల లడ్డూలను నైవేద్యం పెట్టండి. ఈ రాశి వారికి, శని గ్రహం.. మీన రాశిలో తిరోగమనం శుభ ఫలితాలను తెస్తుంది. ఈ సమయంలో వీరి జీవితంలో కొన్ని ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అది ప్రయోజనాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఉద్యోగస్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు పురోగతి సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసు కోవలసి ఉంటుంది.
మిథున రాశి: ఈ రాశి వారు సాయంత్రం సమయంలో రావి చెట్టు కింద ఆవాల నూనె లేదా నువ్వుల నూనె దీపారాధన చేయండి . ఈ రాశి వారు తలపెట్టిన పనులు చాలా నెమ్మదిగా జరుగుతాయి. ఉద్యోగస్తుల విషయంలో మీ పని మీరు చేసుకోండి.. మీకు అవసరంలేని వాటిని అస్సలు ప్రస్తావించవద్దు.. ప్రతి విషయాన్ని ఓపికతో ఆలోచించండి. ఓర్పు సహనం అవసరమని పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారు ఓం నమ:శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని క్రమం తప్పకుండా రోజు 108 సార్లు జపం చేయండి. మీనరాశిలో... శని తిరోగమనం .. ఈ రాశి వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి. గతంలో రావలసిన మొండిబకాయిలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సమాజంలో గౌరవం... కీర్తి... ప్రతిష్టలు లభిస్తాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం లైఫ్ టర్నింట్ పాయింట్ అవుతుంది. ఈ రాశి వారు ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పండితులు సూచిస్తున్నారు.
సింహరాశి: ఈ రాశి వారు నల్ల పప్పు వడలు పేదలకు పంపిణీ చేయండి. ఈ రాశి వారు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జీర్ణక్రియ.. మలబద్ధకానికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేయండి. ఏ విషయంలో కూడా తొందరడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
కన్యారాశి:శక్తి మేరకు పేదలకు అన్నదానం చేయండి .శని .. మీన రాశిలో తిరోగమనం వలన ఈ రాశి వారికి అనుకూల ఫలితాలుంటాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. గతంలో మిమ్మలను ఇబ్బంది పెట్టిన వారు కష్టాలు పడతారు. ఉద్యోగస్తులు ప్రశంశలుపొందుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.
తులారాశి: శివలింగానికి పూలు.. బిల్వ దళాలు సమర్పించండి. అన్ని సానుకూల ఫలితాలు వస్తాయి. శని తిరోగమనం వలన ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలుంటాయి. అనవసరమైన విషయాల జోలికి వెళ్లవద్దు. ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆరోగ్య పరంగా కూడా సమస్యలు ఉంటాయి. ఉద్యోగస్తులు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దని పండితులు సూచిస్తున్నారు.
వృశ్చికరాశి: ఈ రాశి వారు సానుకూల ఫలితాల కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించండి. ఈ రాశి వారు కెరీర్ లో మంచి సక్సెస్ ను అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు కలుగుతాయి. ఎప్పటి నుంచో అనుకున్న కలలు నెరవేరుతాయి. భూములు, ఇళ్ళు కొనుగోలు చేస్తారు. వాహన యోగం కూడా ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ధనుస్సురాశి: ఈ రాశి వారు ఉపశమనం కోసం దశరథ కృత శని స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి.. అంతామంచే జరుగుతుంది. శని తిరోగమనం వల్ల సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఈ సమయం మీ జీవితంలో స్థిరత్వం, ఆనందం పెరుగుతుంది. విద్యార్థులు మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయని పండితులు అంటున్నారు.
మకరరాశి: ఈ రాశి వారు సానుకూల ఫలితాల కోసం శనివారాల్లో సుందరకాండ పారాయణం చేయండి
ఈ రాశి వారికి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు చాలా తెలివిగా పని చేయాలి.
కుంభరాశి: ఈ రాశి వారు ఉపశమనం కోసం గజేంద్ర మోక్ష స్తోత్రాన్ని పఠించండి.ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జన్మంలో నే లగ్నంలో శని ప్రభావం మిమ్మల్ని ప్రభావితం చేయడం వలన .. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. శనితో పాటు, రాహువు మీ జన్మ రాశిలో కూడా ఫలితాలను ఇస్తాడు. మీ సోమరితనం, ఉదాసీనత మరియు ఎవరి మాట వినని స్వభావం మీ స్వంతంగా సమస్యలపై సమస్యలను సృష్టించే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
ALSO READ : ఆధ్యాత్మికం: అందరితో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడవద్దు.. పనులు అస్సలు జరగవు..!
మీనరాశి:ఈ రాశి వారు స్థిరత్వం కోసం క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
అనుకోని పరిస్థితుల్లో స్థాన చలనం ఉంటుంది. విశ్రాంతి లేకుండా పని చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు వస్తాయి. ఈ రాశి వారికి మానసిక అశాంతి కలుగుతుంది. ఆర్థికపరమైన లావాదేవీలలో అతిగా నమ్మడం అనర్ధాలకు దారితీస్తుంది. గతాన్ని మర్చిపోయి జీవితంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో ఎటువంటి భావోద్వేగాలకు లోను కావద్దని పండితులు సూచిస్తున్నారు. ఆధ్యాత్మిక చింతనతో గడపండి.