ఆధ్యాత్మికం: అందరితో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడవద్దు.. పనులు అస్సలు జరగవు..!

ఆధ్యాత్మికం:  అందరితో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడవద్దు.. పనులు అస్సలు జరగవు..!

చాలామంది విశ్రాంతి లేకుండా నోటికి పని చెపుతుంటారు.  ఎప్పుడూ ఎవరినో ఒకరిని తిట్టడం.. లేదా తినడం.. అనవసరంగా మాట్లాడటం ఇలా చేస్తుంటారు.  భర్తకు.. పిల్లలకు అన్నం పెట్టి కూడా ఏదో మాట్లాడుతూ.. ఎవరినో ఒకరిని ఆడిపోసుకునే ఉంటారు. ఇలా చేయడం వలన ఆకుంటుబానికి చాలా అరిష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.  ఎవరితో ఎప్పుడు మాట్లాడాలి.. ఎంతవరకు మాట్లాడాలి.. మొదలగు విషయాల గురించి పురాణాల్లో ఏముంది.. భర్తతో .. పిల్లలతో ఎప్పుడు మాట్లాడాలి.. పనివాళ్లతో.. బంధువులతో ఎప్పుడు చర్చించాలి .. మొదలగు విషయాలు తెలుసుకుందాం. . 

ఈ రోజుల్లో చాలామంది మహిళలు.. కంచంలో అన్నం పెట్టిన తరువాత ఏదో ఒకటి మాట్లాడుతుంటారు.  ఇల్లాలు కంచంలో అన్నం పెట్టిన తరువాత అసలు మాట్లాడకూడదని పండితులు చెబుతున్నారు.  ఇంకా ఏమికావాలి..  ఏమి వడ్డించను అని మాత్రమే అడగాలి కాని లోకాభి రామాయణం గురించి.. ఇంటి సమస్యలు భోజనం చేసేటప్పుడు.. భోజనం పెట్టేటప్పుడు చర్చించకూడదని చెబుతున్నారు.  

ALSO READ : కంటి అద్దాలకు గుడ్‌బై చెప్పండి..సర్జరీ లేకుండా!

భర్త.. పిల్లలు అన్నం  తినేటప్పుడు  కంట్లో నీళ్లు పెట్టుకోవడం.. సాధించడం.. అవమాన పడే విధంగా మాట్లాడటం.. కోపగించుకోవడం.. అరవడం.. బాధపడేలా ప్రవర్తించడం ఇలా అసలు చేయకూడదు.  అలా చేస్తే ఆ కుటుంబానికి అంతా అరిష్టమే జరుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.  ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తరచూ వేధిస్తాయని.. చేపట్టే పనుల్లో ఆటంకాలు కలుగుతాయని చెబుతున్నారు.  

అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు.. అందుకే పూర్వ కాలంలో భోజనం చేసేసమయంలో హరినామస్మరణ చేసేవారు.  ఏదైనా భగవంతుని సంబంధించిన మంచి విషయాలు మాట్లాడుకోవాలి అని చెబుతున్నారు.  అంతేకాని భోజనం చేసేటప్పుడు అనవసర విషయాల జోలికి వెళ్లకూడదంటున్నారు పండితులు.
సమాజంలో భర్తకు కొన్ని విషయాలు చెప్పాలి.. పిల్లలకు విద్యాబుద్దులను చెప్పాలి..పనివాళ్లతో కొన్ని పనులు చేయించుకోవాలి.. బంధువులతో కొన్ని విషయాలు చర్చించాల్సిన అవసరం ప్రతి కుటుంబానికి కచ్చితంగా అవసరమవుతుంది.   భర్తతో రాత్రి సమయంలో...పిల్లలతో సాయంత్రం పూట... పనివాళ్లతో  పగటి పూట..బంధువులతో మద్యాహ్న సమయంలో మాట్లాడితే సరైన రీతిలో పనులు జరుగుతాయని బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తోంది.