న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లోని ఒక హౌసింగ్ సోసైటీలో సోమవారం పెను విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాల నిర్వాహకుడు తన రెండేండ్ల కుమార్తెతో సహా బిల్డింగ్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. మృతుడిని నంగ్లోయ్‌కు చెందిన రాహుల్ విజయరన్ (35) గా గుర్తించారు.
ఆయన గత రెండు నెలలుగా ఈ సొసైటీలోని టవర్-9లో నివసిస్తున్నారు. సోమవారం ఉదయం తన కూతురు వామికను తీసుకొని పార్కుకు వెళ్తున్నానని చెప్పి ఆయన బయటకు వచ్చారు. రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని టవర్ 5పైకెళ్లి 23వ అంతస్తు నుంచి కూతురితో సహా కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
