తాండూర్, వెలుగు: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్ఐ రిచర్డ్ సైమన్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
మండలంలోని ఓ భూమి మ్యుటేషన్ ఫైల్‌ను ఫార్వర్డ్ చేయడానికి గుడిమల్కాపూర్‌లో రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఆర్ఐను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
