కూకట్ పల్లిలోని లులు మాల్ మిక్చర్ ప్యాకెట్ లో ఫ్రైడ్ బల్లి

కూకట్ పల్లిలోని లులు మాల్ మిక్చర్ ప్యాకెట్ లో ఫ్రైడ్ బల్లి
  • ఇన్​స్టాలో పోస్ట్ చేసిన బాధితురాలు
  •     ఫైర్ అవుతున్న నెటిజన్​లు 

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లిలోని ప్రముఖ ‘లులు మాల్’లో కొనుగోలు చేసిన మిక్చర్ ప్యాకెట్​లో ఫ్రై అయిన బల్లి ప్రత్యక్షమవ్వడం కలకలం సృష్టించింది. తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని బాధిత మహిళ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్​గా మారింది.  బాధితురాలి వివరాల ప్రకారం.. గత సోమవారం ఓ కుటుంబం లులు మాల్​లోని హైపర్​మార్కెట్​కు వెళ్లి కార్న్‌‌‌‌ ఫ్లేక్స్ మిక్చర్ ప్యాకెట్ కొనుగోలు చేసింది. 

ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లలు ఆ మిక్చర్​ను కొంత తిన్నారు. శనివారం ఉదయం సదరు మహిళ మిక్చర్ ప్యాకెట్ తెరవగా, అందులో ఫ్రై అయి ఉన్న బల్లిని చూసి షాకైంది. ఈ అంశాన్ని వెంటనే ఇన్​స్టాలో వీడియో తీసి పోస్టు చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన పెద్ద మాల్​లోనే ఇలాంటి ఘోరం జరగడం దారుణమని, మాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.