ఆగస్టు 1 నుంచి 9 వరకు ‘ఘంటీ బజావో.. పింఛన్ దిలావో’

ఆగస్టు 1 నుంచి 9 వరకు ‘ఘంటీ బజావో.. పింఛన్ దిలావో’
  • అక్టోబర్ 1న ఢిల్లీలో భారీ బహిరంగ సభ
  • ఎన్‌‌‌‌ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ 

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది లోక్‌‌‌‌సభ ఎన్నికల నేపథ్యంలో పాత పింఛన్ విధానం పునరుద్ధరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా దశలవారి ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు నేషనల్ మూవ్‌‌‌‌మెంట్ ఫర్ ఓల్డ్ పింఛన్ స్కీమ్ (ఎన్‌‌‌‌ఎంఓపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ తెలిపారు. దేశంలోని ప్రతి జిల్లాలో ఏప్రిల్ 16న పింఛన్ రాజ్యాంగ మార్చ్ నిర్వహిస్తామని, జూన్ 1 నుంచి జాతీయ ఉద్యమం క్విట్ ఇండియా రథయాత్రను చేపడతామని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి 9 వరకు ‘ఘంటీ బజావో.. పింఛన్ దిలావో’నిర్వహిస్తామని చెప్పారు. అప్పటికీ సర్కారులో చలనం రాకుంటే, అక్టోబర్ 1న ఢిల్లీలోని రాంలీల మైదానంలో ‘పింఛన్ శంఖ్‌‌‌‌నాథ్’పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఆదివారం ఢిల్లీలోని ఎన్‌‌‌‌డీ తివారీ భవన్‌‌‌‌లో ఎన్‌‌‌‌ఎంఓపీఎస్ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. '

దీనికి 22 రాష్ట్రాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు రైల్వే, ఆర్డినెన్స్, పోస్టల్, సీపీడబ్ల్యూడీ తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రతినిధులు హాజరయ్యారు. స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఈఎఫ్ఆర్‌‌‌‌‌‌‌‌డీఏ చట్టాన్ని ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తూ, ఉద్యోగుల సొమ్మును కార్పొరేట్ల పాలు చేస్తున్నదని ఆరోపించారు.  ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మళ్లీ పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తున్నాయని గుర్తుకుచేశారు. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, హర్యానా, మధ్యప్రదేశ్, కర్నాటకలో సీపీఎస్ పోరాటం ఉధృతం చేయాలన్నారు. సమావేశంలో తెలంగాణ నుంచి సీపీఎస్ ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, ట్రెజరర్ నరేశ్‌‌‌‌ గౌడ్ పాల్గొన్నారు.