ప్రధాని మోడీ ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఇటలీ చేరుకున్నారు. ఇటలీ రాజధాని రోమ్ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్వయంగా ఎయిర్ పోర్టులో మోడీకి స్వాగతం పలికారు. మెలోని ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్న అనంతరం కొలిసియంను సందర్శించారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా మెలోని కలిసి దిగిన ఫోటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు మోడీ. మోడీ, మెలోని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
రోమ్ లోని కొలిసియం దగ్గర ప్రధాని మోడీతో కలిసి మెలోని తీసుకున్న సెల్ఫీ కూడా నెట్టింట వైరల్ గా మారింది. ఇరు దేశాల అధినేతల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కు, పరస్పర గౌరవానికి ఈ సెల్ఫీ నిదర్శనమని చెప్పచ్చు. మెలోనితో దిగిన ఫోటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు ప్రధాని మోడీ. వెల్కమ్ టు రోమ్ మై డియర్ ఫ్రెండ్ అంటూ మెలోని పెట్టిన క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Upon landing in Rome, had the opportunity to meet Prime Minister Meloni over dinner followed by a visit to the iconic Colosseum. We exchanged perspectives on a wide range of subjects. Looking forward to our talks today, where we will continue the conversation on how to boost the… pic.twitter.com/df0bDYKCdU
— Narendra Modi (@narendramodi) May 20, 2026
ప్రధాని మోడీ, మెలోనిల ఫోటోలు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ట్రేండింగ్ లో ఉన్నాయి. గతంలో కూడా మోడీ, మెలోనిల సెల్ఫీలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
కొలిసియం దగ్గర మెలోనితో దిగిన ఫోటోలు ఎక్స్ షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మోడీ. రోమ్ లో దిగిన వెంటనే మెలోనితో కలిసి డిన్నర్ లో పాల్గొన్నానని..అనంతరం ప్రతిష్టాత్మక కొలిసియంను సందర్శించానని అన్నారు.మేము అనేక అంశాలపై మా అభిప్రాయాలను పంచుకున్నామని... భారత్-ఇటలీ స్నేహాన్ని ఎలా పెంపొందించుకోవాలనే దానిపై ఇవాళ చర్చించనున్నామని అన్నారు మోడీ.
Welcome to Rome, my friend! 🇮🇹🇮🇳 pic.twitter.com/mUjFL4HIqY
— Giorgia Meloni (@GiorgiaMeloni) May 19, 2026
