ఎగుమతులతో రాష్ట్రాలకు పైసలే పైసలు

ఎగుమతులతో రాష్ట్రాలకు పైసలే పైసలు

గుజరాత్‌‌నుంచి అత్యధికం
రెండోస్థా నంలో మహారాష్ట్ర
తెలంగాణ నుంచి మెడిసిన్స్‌‌
ఏపీ నుంచి రొయ్యల ఎగుమతి
వెల్లడించిన నీతి ఆయోగ్‌‌ రిపోర్ట్

న్యూఢిల్లీ: మనదేశంలో చాలా రాష్ట్రాలు ఎగుమతులతో భారీగా సంపాదిస్తున్నాయని తాజాగా విడుదలైన నీతి ఆయోగ్ ‌రిపోర్టు వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వం198 దేశాలకు యాంటాసిడ్ట్యాబ్లెట్లను అమ్ముతోంది. 77 దేశాలకు పాలిష్డ్ ‌డైమండ్స్‌ను అమ్ముతూ బిలియన్ డాలర్లు సంపాదిస్తోంది. గుజరాత్‌ నుంచి ఏటా 10.4 బిలియన్ డాలర విలువైన హైస్పీడ్ ‌‌డీజిల్ 48 దేశాలకు ఎగుమతి అవుతోంది. రాజస్థాన్ ‌‌నుంచి 111 దేశాలకు చెక్క ఫర్నిచర్ వెళ్తుందని నీతిఆయోగ్ తయారు చేసిన ఎక్స్‌పోర్ట్ ‌ప్రిపేర్నెస్‌డ్‌ ఇండెక్స్‌ రిపోర్ట్ ‌‌వెల్లడించింది. మనదేశం నుంచి ఎక్కడెక్కడికి ఎగుమతులు వెళ్తున్నాయనే వివరాలు డైరెక్ట‌రేట్‌ జనరల్ ‌ఆఫ్‌ కమర్షియ‌ల్‌ ఇంటెలిజెన్స్ అండ్‌ స్టాటిస్టిక్స్‌ (డీజీసీఐఎస్‌) దగ్గర ఉంటాయి. ఇది కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధీనంలో పనిచేస్తోంది. రాష్ట్రాల వారీగా ఎగుమతుల విలువను ఈ సంస్థ వెల్లడించడం లేదు. అందుకే నీతి ఆయోగ్ ‌రాష్ట్రాల వారీగా ఎగుమతుల లెక్కలను తయారు చేసింది.

భారీగా వ్యవసాయ ఉత్పత్తు ల ఎగుమతి

పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. పంజాబ్‌ బాస్మతిరైస్‌ను, యూపీ బోన్‌‌లెస్‌మీట్‌ను, ఏపీ రొయ్యలను ఎగుమతి చేస్తున్నాయి. టర్బో ఇంజన్లను, ఇతర ఆటో పార్టులను హరియాణాలోని కంపెనీలు విదేశాలకు అమ్ముతున్నాయి. సముద్రతీర ప్రాంతంలేని తెలంగాణ నుంచి యాంటాసిడ్ట్యాబ్లెట్లు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడి ఫార్మా కంపెనీలు ఏటా 850 మిలియన్ ‌డాలర్ల విలువైన షిప్‌మెంట్లను 168 దేశాలకు పంపిస్తున్నాయి. కెమికల్స్క్రూడ్‌‌, గ్రానైట్‌, బోన్‌‌లెస్‌మీట్ కూడా ఎగుమతి అవుతున్నాయి. అల్యూమినియం, మాంగనీస్‌, స్టీల్‌ ప్రొడక్టులు ఛత్తీస్‌గఢ్‌ నుంచి విదేశాలకు వెళ్తున్నాయి. అల్యూమినియం, ఫెర్రో క్రోమియం కార్బన్‌‌, ఐరన్‌‌ఓర్‌ పెల్లెట్ ‌, రొయ్యలను ఒడిశా కంపెనీలు అమ్ముతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్ ‌నుంచి యాంటాసిడ్‌‌, యాంటీ బయోటిక్‌‌, హైప
ర్‌టెన్షన్‌‌ ట్యాబ్లెట్లు, త్రిపుర నుంచి ఉల్లిగడ్డలు, ఎండు చేపలు ఎగుమతి అవుతున్నాయి. ఢిల్లీ నుంచి టర్బో జెట్‌ ఇంజన్లు, బాస్మతి రైస్‌, గార్మెంట్లు వెళ్తున్నాయి. గోవా, పుదుచ్చేరిలోని కంపెనీ ఫార్మా ప్రొడక్టులను విదేశాలకు పంపుతున్నాయి.

గుజరాత్ ఫస్ట్‌‌
ఎగుమ తులకు అపార అవకాశాలు ఉన్న రాష్ట్రంగా గుజరాత్‌ నిలిచింది. ఇక్కడి నుంచి భారీగా వస్తువులు విదేశాలకు రవాణా అవుతున్నాయి. సముద్రతీరం ఉన్న రాష్ట్రాల్లో ఎగుమతులకు అవకాశాలు ఎక్కువ. అందుకే నీతిఆయోగ్‌ ప్రకటించిన టాప్‌ 10 ర్యాం కుల్లో ఆరు కోస్టల్‌ ఏరియా రాష్ట్రాలే ఉన్నాయి. మనదేశంలో ఎనిమిది రాష్ట్రాలకు సముద్రతీర ప్రాంతం ఉంది.
ఈ ర్యాం కుల్లో రెం డోస్థానం మహారాష్ట్రకు దక్కింది. దక్షిణాది రాష్ట్రాలను గమనిస్తే తమిళనాడు నుంచి అత్యధికంగా ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలోని కంపెనీలు మోటార్‌ కార్లు, కాటర్ టీషర్టులు, డంపర్లు, బేబీ గార్మెంట్లను విదేశాలకు అమ్ముతున్నాయి. కర్ణాటక నుంచి హైస్పీడ్‌‌డీజిల్‌, ఏవియేషన్‌‌టరబైన్ ‌ ‌‌ఫ్యూయల్‌, కాటన్‌ టీషర్టులు ఎగుమతి అవుతున్నాయి. కేరళ ఎగుమతుల్లో బంగారు ఆభరణాలు, మినరల్ ‌ఆయిల్స్‌, జీడిపప్పు వంటివి ఎక్కువ.