రెండు రోజుల తర్వాత సెన్సెక్స్కు లాభాలు

రెండు రోజుల తర్వాత సెన్సెక్స్కు లాభాలు

బిజినెస్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: గ్లోబల్‌‌‌‌ స్టాక్ మార్కెట్‌‌‌‌లు పాజిటివ్‌‌‌‌గా ట్రేడవ్వడంతో పాటు  బ్యాంకింగ్‌‌‌‌, ఐటీ, ఆటో షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో బెంచ్‌‌‌‌మార్క్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌లయిన సెన్సెక్స్, నిఫ్టీలు వరస రెండు రోజుల నష్టాల తర్వాత గురువారం లాభాల్లో కదిలాయి. సెన్సెక్స్‌‌‌‌ 659 పాయింట్లు (1.12 %) లాభపడి 59,688 వద్ద క్లోజయ్యింది. 30 షేర్లున్న ఈ ఇండెక్స్‌‌‌‌లో 24 షేర్లు గురువారం పెరిగాయి. ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ నిఫ్టీ 174 పాయింట్లు (0.99 %) ఎగిసి 17,799 వద్ద ముగిసింది. బ్రెంట్ క్రూడ్‌‌‌‌ రేటు బ్యారెల్‌‌‌‌కు 87 డాలర్లకు పడిపోవడంతో పాటు, విదేశీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ల ఇన్‌‌‌‌ఫ్లోస్ కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడుతోందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఐటీసీ షేరు గురువారం 1.2% పెరిగి రూ.330 వద్ద ఐదేళ్ల గరిష్టాన్ని నమోదు చేసింది. 

బ్రాడ్ మార్కెట్‌‌‌‌ చూస్తే బీఎస్‌‌‌‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్‌‌‌‌ 0.60‌‌‌‌‌‌‌‌ %, మిడ్ క్యాప్ ఇండెక్స్‌‌‌‌ 0.29% పెరిగాయి. సెక్టార్ల పరంగా చూస్తే బీఎస్‌‌‌‌ఈ బ్యాంక్‌‌‌‌, ఫైనాన్స్‌‌‌‌, టెక్‌‌‌‌, ఐటీ, టెలికం ఇండెక్స్‌‌‌‌లు ఎక్కువగా లాభపడ్డాయి. బీఎస్‌‌‌‌ఈలోని మొత్తం 2,062 షేర్లు లాభపడగా, 1,402 షేర్లు నష్టపోయాయి. బ్రెంట్ క్రూడాయిల్  గురువారం  0.49% తగ్గి బ్యారెల్‌‌‌‌కు 87.57 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం 23 పైసలు పెరిగి 79.72 వద్ద సెటిలయ్యింది. 

ఎనలిస్టులు ఎమంటున్నారంటే?
1) క్రూడాయిల్ ధరలు తగ్గడంతో   గ్లోబల్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లు లాభాల్లో ట్రేడవుతున్నాయని, మన మార్కెట్‌‌‌‌లు కూడా ఇదే బాటలో కదిలాయని  జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. క్రూడ్ ధరలు తగ్గుతుండడంతో ఇన్‌‌‌‌ఫ్లేషన్ భయాలు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. వాల్యుయేషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ, విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా మారడంతో దేశ స్టాక్ మార్కెట్‌‌‌‌లు బలంగా ఉన్నాయని  అన్నారు. వెహికల్ సేల్స్ ఆగస్టు నెలలో ఏడాది ప్రాతిపదికన 8.3 శాతం పెరగడంతో ఆటో షేర్లపై ఇన్వెస్టర్ల ఫోకస్ పెరిగిందని అన్నారు.  

2) 17,300–17,800 కన్సాలిడేటెడ్‌‌‌‌ రేంజ్‌‌‌‌లో  చివరి లెవెల్‌‌‌‌కు నిఫ్టీ చేరిందని రెలిగేర్ బ్రోకింగ్ వైస్  ప్రెసిడెంట్‌‌‌‌ (రీసెర్చ్‌‌‌‌) అజిత్‌‌‌‌ మిశ్రా పేర్కొన్నారు., ఈ లెవెల్ నుంచి బ్రేక్ అవుట్‌‌‌‌ అయితే  18,100 పైకి కదలడం చూడొచ్చని అన్నారు. ముఖ్యంగా వివిధ సెక్టార్లలో బయ్యింగ్ పెరుగుతుండడంతో పాటు, విదేశీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ల ఇన్‌‌‌‌ఫ్లోస్ కొనసాగుతుండడంతో బ్రేక్ అవుట్ ఉండొచ్చన్నారు.

3) ఈ నెల 7 న కీలక లెవెల్ అయిన 17,500 దగ్గర నిఫ్టీకి సపోర్ట్ లభించిందని, అక్కడి నుంచి పెరుగుతూ వస్తోందని షేర్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌ టెక్నికల్ ఎనలిస్ట్ గౌరవ్‌‌‌‌ రత్నపరేఖి అన్నారు. 17,200–18,000 కన్సాలిడేషన్ రేంజ్‌‌‌‌లోని  అప్పర్ సైడ్‌‌‌‌కి నిఫ్టీ వచ్చిందని, 18,000 లెవెల్‌‌‌‌కు వచ్చేటప్పుడు నిఫ్టీ కొంత పడొచ్చని చెప్పారు.