ప్రతిష్ఠించిన అరగంటకే నిమజ్జనం

ప్రతిష్ఠించిన అరగంటకే నిమజ్జనం

కోస్గి, వెలుగు: వినాయక మండపానికి పర్మిషన్ లేనప్పటికీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గణపతిని నిలపెట్టిన అరగంటలోపే నిమజ్జనం చేశారు. మండప నిర్వాహకులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని బాలం పేట్ గ్రామంలో మారుతి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతియేటా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చారు. పోలీసులు వచ్చి అభ్యంతరం చెప్పారు.

దీంతో శనివారం రాత్రి 9 గంటలకు ప్రతిష్ఠించిన వినాయకుడిని రాత్రి 11 గంటలకు నిమజ్జనం చేశారు. రూల్స్‌‌పాటిస్తూ ఉత్సవాలు జరుపుకుందామనుకునే లోపే పోలీసులు అడ్డుకున్నారని యూత్ సభ్యులు ఆరోపించారు. బలవంతంగా నిమజ్జనం చేయించారని వాపోయారు. ఈ విషయమై దౌల్తాబాద్ ఎస్సై విశ్వజాన్ను వివరణ కోరగా.. కోవిడ్ రూల్స్ ‌పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని కోరగా..ఆ యువకులే వినాయకుడిని నిమజ్జనం చేశారని చెప్పారు.