గంగా నదిని కడిగేసిన లాక్ డౌన్… స్వచ్చంగా నీళ్లు

గంగా నదిని కడిగేసిన లాక్ డౌన్… స్వచ్చంగా నీళ్లు

చాలా ఏళ్ల తర్వాత గంగా నది నీళ్లు స్వచ్చంగా మారాయి. లాక్ డౌన్‌తో వారణాసి, హరిద్వార్ పరిసర ప్రాంతాలలోని పరిశ్రమల వ్యర్థాలు గంగా నదిలో కలవడం లేదు… దీంతో నీళ్లు క్లీన్‌గా కనిపిస్తున్నాయి. శాస్త్రవేత్తలు గంగా నదిలోని నీటిని పరిశీలించి.. తాగడానికి వీలుగా గంగా నది నీళ్లు మారాయని.. దాదపు 50శాతం ప్యూరిఫై అయ్యాయని తెలిపారు.  వాటిని చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మార్చ్ 24 ప్రధాని నరేంధ్ర మోడీ ఇచ్చిన లాక్ డౌన్ పిలుపు తర్వాత… కొన్ని రోజుల నుంచి గంగానదిలో మార్పు కనపడుతుందని స్థానికులు తెలిపారు. పారిశ్రామిక వ్యర్థాలతో పాటు అక్కడి లోకల్ వ్యాపారులు, హోటల్స్ నుంచి వచ్చే వ్యర్థాలు నదిలో కలవకపోవడం వలన ఈ మార్పు సంభవించిందని అన్నారు..   ఈ మధ్య  కురిసిన వర్షాల వలన గంగా నది నీళ్లు స్వచ్చంగా మారడానికి కారణమయ్యాయని శాస్త్రవెత్తలు తెలిపారు. దీంతో పాటు యమునా నదిలో కూడా నీటి క్వాలిటి పెరిగిందని అన్నారు. నీటి అడుగుబాగంలోని చిన్న రాళ్లు కూడా కనపడేంత స్వచ్చంగా గంగానది నీళ్లు మారాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం  గంగానది వీడియోలు వైరల్ అవుతున్నాయి. లాక్ డౌన్ తో అందరూ ఇళ్లకు పరిమితమవడంతో… కొండ ప్రాంతాల దగ్గర ఉన్న నగరాల మధ్యకు అడవి జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి.