- రూ.15 వేలు తీసుకుంటూ చిక్కిన ఆఫీసర్
భూపాలపల్లి అర్భన్, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్లో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా ఇండస్ట్రియల్ మేనేజర్ గంగాధర శ్రీనివాస్ రూ.15వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన గుగులోతు లచ్చిరాం గత సంవత్సరం జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా రూ.53 లక్షలకు వ్యాన్ కొన్నారు.
దీనికి సంబంధించిన సబ్సిడీ కోసం లచ్చిరాం కొద్ది రోజుల క్రితం జిల్లా పరిశ్రమల శాఖలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ శాఖ ఆఫీసర్ శ్రీనివాస్.. లచ్చిరాం నుంచి రూ.50 వేలు తీసుకు న్నాడు. మళ్లీ రూ.60 వేలు కావాలని డిమాండ్ చేయడంతో లచ్చిరాం ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు గురువారం లచ్చిరాం రూ.15వేలను శ్రీనివాస్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. నిందితుడిని హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

