V6 News

BCCI అధ్యక్ష పదవికి గంగూలీ నామినేషన్

BCCI అధ్యక్ష పదవికి గంగూలీ నామినేషన్

బోర్డ్  ఆఫ్ కంట్రోల్ ఫర్  క్రికెట్  ఇన్ ఇండియా(BCCI) అధ్యక్ష పదవికి ఇవాళ  ముంబైలో సౌరవ్ గంగూలీ నామినేషన్ దాఖలు చేశారు. తన దృష్టంతా క్రికెట్ పైనే ఉంటుందని, ఈ పదవిని తానెప్పుడుకూ కోరుకోలేదని ఇప్పుడు తన సేవలు అవసరమనే నామినేషన్ దాఖలు చేశామన్నారు గంగూలీ. ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల చెల్లింపులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

బీసీసీఐ కార్యవర్గం ఎన్నికలు అక్టోబరు 23న నిర్వహించనున్నారు. నామినేషన్లకు అక్టోబరు 14 తుది గడువుగా విధించారు.

ఇక కొత్త సెక్రటరీ పదవికి హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా నామినేషన్ దాఖలు చేయగా… ట్రెజరర్​గా అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ ధుమాళ్ నామినేషన్ దాఖలు చేశారు.