గంభీర్‌..వ్యక్తిత్వమే లేని మనిషి: అఫ్రిది

గంభీర్‌..వ్యక్తిత్వమే లేని మనిషి: అఫ్రిది
  •  పెద్ద రికార్డు లేమీ లేవు.. ఉన్నది యాటిట్యూడ్‌ మాత్రమే
  • గంభీర్‌ పై ఆటోబయోగ్రఫీలో అఫ్రిది తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ పై పాకిస్థా న్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది ఘాటు విమర్శలు చేశాడు. గంభీర్‌ కు వ్యక్తిత్వమే లేదన్నాడు. క్రికెట్‌ లో పెద్దగా రికార్డు లు లేని గౌతీకి ఉన్న దల్లా యాటిట్యూడ్‌ మాత్రమే అని తన ఆటో బయోగ్రఫీ ‘గేమ్‌ ఛేంజర్‌ ’లో రాసుకొచ్చాడు. ఈ పుస్తకంలో తన అసలు వయసెంతో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచిన పాక్‌ క్రికెటర్​.. ఇలా గౌతమ్‌ పై చేసిన విమర్శలు చర్చనీయాంశంగామారాయి.

‘క్రికెట్‌ లో వైరం కొందరితో ప్రొఫెషనల్‌ గా ఉంటుం ది. మరికొందరితో వ్యక్తిగతంగా ఉంటుంది. గంభీర్‌  రెండో రకం. అబ్బో గంభీర్‌ .అతను, అతని యాటిట్యూడ్‌ ప్రాబ్లమ్‌ . గంభీర్‌ కు అసలు వ్యక్తిత్వమే లేదు. విశాలమైన క్రికెట్‌ ప్రపంచంలో గౌతమ్‌ ఒక వ్యక్తి మాత్రమే. ఆటలో అతనికి పెద్దగా రికార్డులు కూడా లేవు. ఉన్నదల్లా యాటిట్యూడ్‌ మాత్రమే. డాన్‌ బ్రాడ్‌ మన్‌ కు, జేమ్స్‌ బాండ్‌ కు మధ్య తానే అన్నట్టు గంభీర్‌ బిహేవ్‌ చేస్తాడు. ఇలాంటి వాళ్లను కరాచీలో మేం సర్యల్‌ (ముక్కోపి) అంటాం. నాకైతే హ్యాపీగా, పాజిటివ్‌ గా ఉండే వ్యక్తులంటే ఇష్టం . వాళ్లు దూకుడుగా ఉంటారా లేక కాంపిటేటివ్‌ గా ఉంటారా అన్నది అనవనరం గానీ పాజిటివ్‌ గా ఉండి తీరాలి. కానీ, గంభీర్‌ అలా అస్సలు ఉండడు. 2007 ఆసియా కప్‌ సందర్భంగా మా ఇద్దరి మధ్య జరిగిన గొడవ నాకు బాగా గుర్తుంది. ఒకవేళ అంపైర్లు మమ్మల్ని ఆపకపోయి ఉంటేనేనే అతని అంతు చూసి ఉండేవాడిని. అప్పుడు మేం ఒకరి ఫ్యామిలీ ఆడవాళ్ల గురించి మరొకరం బూతులు తిట్టు కున్నామ’ని అని అఫ్రిది తన పుస్తకంలో రాసుకొచ్చాడు.