నేరెడ్ మెట్లో గ్యాంగ్ రేప్.. బాలికపై ఐదుగురు యువకుల అత్యాచారం

నేరెడ్ మెట్లో గ్యాంగ్ రేప్.. బాలికపై ఐదుగురు యువకుల అత్యాచారం

హైదరాబాద్ నేరెడ్ మెట్ లో దారుణంజరిగింది. బాలికపై ఐదుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  బాలికను  ట్రాప్ చేసి నేరెడ్ మెట్  తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు యువకులు. అమ్మాయి గర్భం దాల్చడంతో బయటకు ఈ విషయం బయటకు వచ్చింది. 

కాచిగూడలో ఉంటున్న బాలికకు గంజాయి అలవాటు చేశారు యువకులు. గంజాయి మత్తులోకి వెళ్లగానే బాలికను అత్యాచారం చేశారు యువకులు. అయితే  ఈ విషయాన్ని తల్లికి చెప్పకుండా దాచిపెట్టింది ఆ బాలిక.  బాలిక శరీరంలో మార్పులు రావడంతో గమనించి నిలదీసింది తల్లి. దీంతో జరిగిన విషయాన్ని తల్లికి వివరించింది బాలిక.  కాచిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నేరేడ్మెట్ కు బదిలీ చేశారు పోలీసులు.  బాలికపై అత్యాచారం చేసిన యువకుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.