వినాయక చవితి సందర్భంగా భక్తి భావంతో పాటు సామాజిక, పర్యావరణ సందేశాన్ని అందించే గణనాథులను ప్రతిష్టించారు భక్తులు. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో భక్తులు పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ రకాల వినాయకులను ప్రతిష్టించారు. అందులో కాగజ్ నగర్ పట్టణంలో శ్రీ సాయి గణేష్ మండలి వారు ఐబీర్డ్ బబ్బర్లు(రాజ్మా రాజస్థాన్)తో చేసిన గణనాధుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు.
రాజస్థాన్ వెరైటీ విత్తనాలైన 21 కిలోల బొబ్బర్లతో వినాయకుని తయారు చేసి మండపంలో ప్రతిష్టించారు. ఈ వినాయకునికి రెండు వైపులా కలిపి ఎనిమిది చేతులు ఉన్నాయి. చేతులలో లైట్లు వెలుగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం కొలువైన ఈ వినాయకుడు భక్తులను ఆకర్షిస్తున్నారు.
మరోవైపు శ్రీ ఆదిత్య గణేష్ మండలి నిర్వాహకులు దీపం వత్తులతో వినాయకుని తయారు చేసి మండపంలో ప్రతిష్టించారు. భక్తులు ఈ మండపాల వద్దకు వచ్చి పూజలు చేస్తున్నారు. అటు బొబ్బర్లతో చేసిన గననాథుడు, ఇటు వత్తులతో చేసిన వినాయకులను చూసేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
