నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్ నగర్ సమీపంలోని కుంట్లూరు రాజీవ్ గృహకల్ప దగ్గర ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. 2026 సెప్టెంబర్ 15న ఉదయం జరిగిన
ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
హయత్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజీవ్ గృహకల్ప నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని మెయిన్ రోడ్డును క్రాస్ చేస్తున్న సమయంలో జరిగింది ఈ ప్రమాదం. నాగోల్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ బస్సును బలంగా ఢీకొట్టింది.
వేగంగా టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు ఒక్కసారిగా భారీ కుదుపులకు గురైంది. పల్టీ కొట్టినంత పనైందని బాధితులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రతకు బస్సులోని డ్రైవర్ సహా దాదాపు 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, క్షతగాత్రులను స్టానిక ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
