Good Health: చేత్తో అన్నం తినండి.. షుగర్ వ్యాధి కంట్రోల్..స్లిమ్ అవుతారు..!

Good Health:  చేత్తో అన్నం తినండి.. షుగర్ వ్యాధి కంట్రోల్..స్లిమ్ అవుతారు..!

హైజిన్ పేరుతో చాలామంది చేత్తో తినడమే మానేశారు ఈ మధ్య. కానీ, శుభ్రత మాట అటుంచితే స్పూన్ తో తినడం వల్ల లేనిపోని తిప్పలు వచ్చిపడతాయి. అందుకే 'ఇకనుండైనా కాస్త చేతికి పనిచెప్పండి' అంటున్నారు న్యూట్రిషనిస్ట్ నిపుణులు. అంతేనా చేత్తో తినడం వల్ల కలిగే లాభాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

చేత్తో తిన్నా ఎక్సర్సైజే

చేత్తో తింటే అది 'మైండ్ ఫుడ్ ఈటింగ్' అవుతుంది. తినే ఫుడ్ పై కాన్సన్​ స్ట్రేషన్ ఉంటుంది. ఎంత తింటున్నామన్న లెక్క ఉంటుంది. పైగా కాస్త మెల్లిగా తింటాం. వీటివల్ల కొంచెం తిన్నా కూడా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది.

అదే స్పూన్​ తో  తింటే ఎంత తిన్నా తిన్నట్టే అనిపించదు. ఎంత టేస్టీ వంటకమైనా తిన్న సాటిస్ ఫాక్షన్ ఉండదు. దాంతో తినే క్వాంటిటీ ఎక్కువై, బరువూపెరుగుతారు.

చేత్తో తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ నుంచి తప్పించుకోవచ్చు. అదెలాగంటే..చాలామంది కుదురుగా కూర్చొని తినే టైం లేక స్పూన్​ తో  గబగబా తింటుంటారు.

దానివల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ లో  తేడా వచ్చి టైప్ -2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. టైప్-2 డయాబెటిస్ తో  బాధపడేవాళ్లలో ఎక్కువ మందిస్పూన్​ తో  తినే అలవాటున్నవాళ్లేనని చాలా స్టడీల్లో తేలింది.చేత్తో తింటే అరుగుదల సమస్యలు కూడా రావు. అన్నం లేదా ఇతర ఫుడ్ ఐటెమ్స్ చేత్తో పట్టుకున్నప్పుడు తినడానికి రెడీ అని బ్రెయిన్ పొట్టకు సిగ్నల్స్​ పంపిస్తుంది. దాని వల్ల తిన్న ఫుడ్​  త్వరగా అరిగిపోతుంది. కానీ, స్పూన్ తో  తినడం వల్ల బ్రెయిన్ నుంచి పొట్టకి ఆ సిగ్నల్స్ వెళ్లవు.

చేతి వేళ్లపై ‘నార్మల్ ఫ్లోరా' అనే బ్యాక్టీరియా ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు. పైగా బయటి నుంచి శరీరంలోకి వచ్చే హానికర బ్యాక్టీరియాలని అడ్డుకుంటుంది. అందుకే ఈ బ్యాక్టీరియాని నోరు, గొంతు, డైజేషన్ ట్రాక్, చిన్న పేగులలో వృద్ధి చేసుకోవడం చాలా అవసరం. అందుకు ఏవేవో ప్రయత్నాలు చేయనక్కర్లేదు సింపుల్​గా  చేత్తో అన్నం తింటే చాలు.

స్పూన్, ఫోర్క్స్​తో  తినడం వల్ల ఫుడ్ క్వాలిటీ, టెంపరేచర్ తెలియదు. కానీ, చేత్తో తింటే ఫుడ్ చల్లగా ఉన్నా, మరీ వేడిగా ఉన్నా వెంటనే తెలుస్తుంది. చేత్తో పట్టుకోవడం వల్ల ఫుడ్ టెక్స్చర్, స్మెల్ కూడా తెలుస్తాయి. దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ నుంచి తప్పించుకోవచ్చు.

చేత్తో తినడం కూడా ఒక ఎక్సర్సైజ్. చేత్తో ఫుడ్ కలిపి, తినడం వల్ల కండరాలు బలపడతాయి. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి బాడీ ఫిట్​ గా  ఉంటుంది. ఈ లాభాలన్నీ కావాలంటే చేతుల్ని శుభ్రంగా కడుక్కుని తినాల్సిందే అంటున్నారు ఈ న్యూట్రిషన్​ నిపుణులు.