అణ్వాయుధ రహిత ప్రపంచం కోసం భారత్ కట్టుబడి ఉంది

అణ్వాయుధ రహిత ప్రపంచం కోసం భారత్ కట్టుబడి ఉంది

అణ్వాయుధ రహిత ప్రపంచం కోసం అన్ని దేశాలతో కలిసి భారత్ పని చేస్తుందన్నారు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా. న్యూ క్లియర్ వెపన్స్ ఎలిమినేషన్ అంశంపై 76వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో శ్రింగ్లా మాట్లాడారు. అణ్వాయుధ రహిత ప్రపంచాన్ని నిబద్ధతతో దశల వారీగా సాధించొచ్చన్నారు. దీనికి భారత్ కట్టుబడి ఉందన్నారు. అణ్వాయుధాల విషయంలో భారత్ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించే దేశమని శ్రింగ్లా చెప్పారు.