బొల్లారం పరిధిలో మహిళపై పౌడర్ చల్లి.. 7 తులాల పుస్తెల తాడు చోరీ

బొల్లారం పరిధిలో మహిళపై పౌడర్ చల్లి.. 7 తులాల పుస్తెల తాడు చోరీ
  • బొల్లారం పరిధిలోని చింతల్ బజార్‌‌లో ఘటన

పద్మారావునగర్, వెలుగు: గృహిణిపై గుర్తు తెలియని దుండగుడు దాడి చేసి బంగారం గొలుసుతో పరారైన సంఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చింతల్ బజార్‌‌కు చెందిన పంపరి స్వరూప (36) అనే గృహిణి సోమవారం ఉదయం తన ఇంటి ముంగిట మొక్కలకు నీళ్లు పోస్తోంది. ఈ క్రమంలో ఆమె సంప్ నుంచి నీరు తోడటానికి కిందకు వంగింది.

అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఒక దుండుగుడు ఆమె ముఖంపై టాల్కమ్ పౌడర్ చల్లాడు. ఆమె తేరుకునేలోపే దుండగుడు మెడలోని 7 తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి  ఫిర్యాదుతో పోలీసులు ఈ ఘటనపై కేసును నమోదు చేశారు.