బంగారం రేట్ల పెరుగుదలకు బ్రేక్.. కేజీకి రూ.5వేలు పెరిగిన వెండి.. హైదరాబాద్ రేట్లివే..

బంగారం రేట్ల పెరుగుదలకు బ్రేక్.. కేజీకి రూ.5వేలు పెరిగిన వెండి.. హైదరాబాద్ రేట్లివే..

ఈ వారం స్టార్టింగ్ నుంచి క్రమంగా పెరిగిన బంగారం రేట్లు శుక్రవారం రోజున తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా కొనసాగుతున్న గందరగోళ పరిస్థితులతో బులియన్ మార్కెట్ కూడా స్పష్టమైన దిశ లేకుండా ముందుకు సాగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇరాన్ విషయంలో ట్రంప్ పూటకో మాట చెప్పటమే ఈ పరిస్థితులకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని తాజా రిటైల్  ధరలను పరిశీలించటం బెటర్. 

 మే22న బంగారం రేట్లు తగ్గాయి. మే 21 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.44 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 949గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 620గా కొనసాగుతోంది. 

శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మే 22, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.5వేలు పెరిగి రూ.2లక్షల 95వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపుగా రూ.295 దగ్గర ఉంది.