బిజినెస్ ఫ్రమ్ హోమ్ కి మంచి రెస్పాన్స్

బిజినెస్ ఫ్రమ్ హోమ్ కి మంచి రెస్పాన్స్

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై ప్రమోషన్
బయటకు రావాలంటే కరోనా భయం
ఆన్ లైన్ లో కొనేందుకే సిటిజన్స్ ఇంట్రెస్ట్
అవకాశంగా మలుచుకుని ఉపాధి పొందుతున్న పలువురు
యాక్ససరీస్, క్లాతింగ్, ఫుడ్ బిజినెస్ తో ఇన్ క‌మ్

హైదరాబాద్, వెలుగు: కరోనా అనేకమందికి ఉపాధి లేకుండా చేసింది. వైరస్ భయంతో చాలామంది బయటకు రావడం లేదు. నిత్యావసర వస్తువుల నుంచి క్లాత్స్, ఫుడ్ ఏదీ కావాలన్నా ఆన్ లైన్ నే ప్రిఫర్ చేస్తున్నారు. ఈ పరిస్థితులనే కొందరు అనుకూలంగా మార్చుకుని.. ఇంటి నుంచే సారీస్, జువెలరీ, యాక్ససరీస్, క్లాత్, ఫుడ్ బిజినెస్ వంటివి స్టార్ట్ చేస్తున్నారు. వారిలో విమెన్స్ ఎక్కువగా ఉన్నారు. ముంబయి, జైపూర్, సూరత్ లోని డీలర్స్ తో టైఅప్ అయి అక్కడి నుంచి శారీస్, డ్రస్ మెటీరియల్స్ తెప్పిస్తున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల్లో అకౌంట్స్ ఓపెన్ చేసి ప్రమోషన్ చేసుకుంటున్నారు. వాట్సాప్ ను ఉపయోగించుకుంటున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు.
అంతా ఆన్లైన్లోనే…
కరోనా ఎఫెక్ట్ తో బయటకు వెళ్లి షాపింగ్ చేసేవారి సంఖ్య తగ్గింది. ఏ ప్రొడక్ట్ అయినా డోర్ స్టెప్ రావాలనుకుంటున్నారు. ఆన్ లైన్ లో కొనేవారు పెరుగుతున్నారు. దాంతో లాక్ డౌన్లో బిజినెస్ స్టార్ట్ చేసినవాళ్లు హోం డెలివరీకి ప్రయారిటీ ఇస్తున్నారు. కస్టమర్ కోరుకున్న ప్రొడక్ట్స్ కొరియర్ లో ఇంటికి పంపిస్తున్నారు. ‘‘లాక్ డౌన్ తో ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఫైనాన్షియల్ గా సఫర్అయ్యాం. ఆన్ లైన్ లో సారీస్ సేల్ చేస్తే బాగుంటుందని ఆలోచించి నెల కిందట స్టార్ట్ చేశా. రెస్సాన్స్ బాగుంది’’ అని తెలిపారు స్నేహజ.

సూరత్ నుంచి శారీస్ తెప్పించి కస్టమర్ల‌కు కొరియర్ చేస్తున్నట్లు చెప్పారు. బడ్జెట్ ఫ్రెండ్లీ, క్వాలిటీ క్లియర్ గా కస్టమర్లకు తెలిపిన తర్వాతే ఆర్డ‌ర్స్ తీసుకుంటున్నామన్నారు. ‘‘లాక్ డౌన్ తో ఆన్ లైన్ లో వర్కవుట్స్ చేసే వారి సంఖ్య పెరిగింది.నాకు తెలిసిన ట్రైనర్స్ ద్వారా వారి క్లైంట్స్ కి ప్రాపర్ డైట్ ఫుడ్ పంపిస్తున్నా. డిఫరెంట్ ప్యాకేజీల్లో డోర్ డెలివరీ చేస్తున్నాం. డైట్ బట్టి చార్జ్ చేస్తున్నా’’మని సల్మాన్ చెప్పుకొచ్చాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం