గూగుల్ యాప్స్, గూగుల్ ప్లేలోని యాప్స్‌ని అప్డేట్ చేస్తుంది గూగుల్ ప్లే సర్వీసెస్. ఈసారి సెల్ఫ్ షేర్ ఫీచర్ తీసుకొచ్చింది. యూజర్లు ఈ ఫీచర్ సాయంతో ఫైల్స్, లింక్స్, టెక్స్ట్‌ను ఫోన్ లేదా సిస్టం నుంచి దగ్గర్లోని వేరే డివైజ్‌కి పంపొచ్చు. అంతేకాదు ప్రతిసారి ఫైల్ షేర్ చేసేటప్పుడు అనుమతి అవసరం లేదు. ఈ ఫీచర్ కోసం ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే సర్వీసెస్‌ని 22.15 వెర్షన్‌కి అప్డేట్ చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్ 30.3 వెర్షన్ ఉండాలి. ఈ అప్డేట్ కోసం... సెట్టింగ్స్‌లో ఎబౌట్ ఫోన్ ఆప్షన్ సెలక్ట్ చేయాలి. ఆండ్రాయిడ్ వెర్షన్‌పై క్లిక్ చేసి, గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్ని ఎంచుకోవాలి. గూగుల్ హెల్ప్ యాప్‌కి కొత్త డిజైన్ వచ్చింది.
