గూగుల్​ పేపర్​ ఫోన్

గూగుల్​ పేపర్​ ఫోన్

ఆ ఫోన్​ నుంచి ఫోన్లు చేసుకోలేం. మెసేజ్​లు పంపించుకోలేం. వాట్సాప్​లో చాటింగ్​ చెయ్యలేం. ముచ్చటపడి ఓ సెల్ఫీ తీసుకోలేం. అదే గూగుల్​ తీసుకొస్తున్న కొత్త ‘పేపర్​ ఫోన్​’!! అరె.. పైవన్నీ లేకుండానే దాన్ని ఫోన్​ ఎట్లంటరు? అసలెప్పుడు దాన్ని తీసుకొచ్చిన్రు? అని ఆలోచించకండి. ఆ మధ్య గూగుల్​ పిక్సెల్​ 4 ఫోన్​ను రిలీజ్​ చేసింది. దానిని విడుదల చేసిన కొద్ది రోజులకే ఈ పేపర్​ ఫోన్​నూ తీసుకొచ్చింది. నిజానికి ఇది ఫోన్​ కాకపోయినా, ఓ మంచి ఉద్దేశంతోనే ఈ పేపర్​ఫోన్​ ఆలోచన చేసింది గూగుల్​. నేటి ప్రపంచం మొత్తం స్మార్ట్​ అయిపోయిన సంగతి తెలిసిందే. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ల దాకా.. ఫోన్​లల్లనే మొహం పెట్టి చూస్తున్నారు కదా.

ఇదిగో, దాని నుంచి తప్పించేందుకే కంపెనీ ఈ ఉపాయం చేసింది. ఓ పెద్ద పేపర్​ ముక్కను మడతపెట్టి, అందులో మన ఫోన్లలో ఉన్న ఫీచర్లను ప్రింట్​ చేయించింది. మనం ఫోన్​లో పెట్టుకునే వాల్​పేపర్​ దగ్గర్నుంచి, రోజూ మనం ఎక్కువగా వాడే యాప్స్​ వరకు అన్నింటినీ పొందుపరిచింది. మనం రోజూ ఫోన్​లో ఏమేం చేస్తామో వాటన్నింటినీ అందులో వివరంగా పేర్కొంటుంది. చాలా అవసరమైన యాప్స్​నే వాడుకునేలా ‘డిజర్ట్​ ఐల్యాండ్​’ అనే ప్రోగ్రామ్​ను పెట్టింది. తమ కస్టమర్ల మంచి కోసమే ఈ ఆలోచన చేసినట్టు గూగుల్​ క్రియేటివ్​ ల్ఆయబ్​ టీం హెడ్​ ఎమ్మా తుర్పిన్​ చెప్పారు.

నో టెక్​ సండేస్​

గూగుల్​ ఒక్కటే కాదు, డిజిటల్​ ప్రపంచం నుంచి కాస్త ఉపశమనం కోసం చాలా కంపెనీలు, చాలా మంది ఇలాంటి కార్యక్రమాలే ప్రారంభించారు. ‘నో టెక్​ సండేస్​’ పేరిట ఓ కార్యక్రమమే నడుస్తోంది. అంటే ఆదివారం ఒక్క రోజు ఎలాంటి ఫోన్లు, టెక్నాలజీ పరమైన గాడ్జెట్లు వాడకూడదన్న మంచి కార్యక్రమం. అంతేకాదు, ‘నేషనల్​ డే ఆఫ్​ అన్​ప్లగ్గింగ్​’ పేరిట కొన్ని దేశాల్లో ఈవెంట్లు కూడా జరుగుతున్నాయి. టెక్నాలజీ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లేందుకు కొన్ని రిసార్టులు, ట్రావెల్​ సంస్థలు డిజిటల్​ డిటాక్స్​ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. గూగుల్​ పేపర్​ ఫోన్​ కార్యక్రమం మొదటిదేం కాదు. అంతకుముందు 2014లో గూగుల్​ కార్డ్​బోర్డు కార్యక్రమాన్నీ కంపెనీ చేపట్టింది. అందులో భాగంగా స్మార్ట్​ఫోన్​లోని వర్చువల్​ రియాలిటీ అప్లికేషన్లను ఆ కార్డ్​బోర్డులోనే పెట్టింది.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి