ఉత్తరాఖండ్ మాజీ సీఎం మృతికి గవర్నర్ సంతాపం

ఉత్తరాఖండ్ మాజీ సీఎం మృతికి గవర్నర్ సంతాపం

హైదరాబాద్, వెలుగు:  ఉత్తరాఖండ్ మాజీ సీఎం, మేజర్ జనరల్ (రిటైర్డ్) భువన్ చంద్ర ఖండూరి మరణంపై  గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడిగా ఆయన దేశానికి అందించిన విశిష్ట సేవలను గవర్నర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

సాయుధ దళాల్లోనూ, ప్రజా జీవితంలోనూ బీసీ ఖండూరి  అందించిన సేవలు చిరస్మరణీయమని బుధవారం పత్రిక ప్రకటనలో గవర్నర్ పేర్కొన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు. ఆయన మరణం తీరని లోటని చెప్పారు. బీసీ ఖండూరి కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.