లోక్‌భవన్‌ ఉద్యోగులతో  గవర్నర్ ఆత్మీయ సమావేశం

లోక్‌భవన్‌ ఉద్యోగులతో  గవర్నర్ ఆత్మీయ సమావేశం

హైదరాబాద్, వెలుగు: లోక్ భవన్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో గవర్నర్ శివప్రతాప్ శుక్లా సమావేశం అయ్యారు. బుధవారం లోక్ భవన్‌లో గవర్నర్ స్పెషల్ సీఎస్ దానకిషోర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. గవర్నర్ మాట్లాడుతూ, బాధ్యతతో విధులు నిర్వహించి లోక్‌భవన్‌ ప్రతిష్టను మరింత పెంచాలన్నారు.

అనంతరం ఉద్యోగుల కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. లోక్​భవన్​లో పనిచేసే ఉద్యోగులకు హోదాతో  సంబంధం లేకుండా లోక్ భవన్ ఉద్యోగిగా గుర్తింపు ఉంటుందన్నారు. లోక్‌భవన్‌లో పనిచేసే అవకాశం రావడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.