సర్కారు దెబ్బకు మిల్లర్లు సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!

సర్కారు దెబ్బకు మిల్లర్లు సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!
  •     గత సీజన్​లో 2,263 మిల్లులకు మాత్రమే సీఎంఆర్
  •     డిఫాల్టర్లుగా ఉన్న 863 మిల్లర్లకు జీరో అలాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  •     తాజాగా 138 మంది మిల్లర్ల నుంచి రూ.68 కోట్లు రికవరీ
  •     అక్రమ మిల్లర్లపై కొరడా ఝళిపించిన సర్కారు

హైదరాబాద్, వెలుగు: అక్రమ మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝలిపించింది. సర్కారు దెబ్బకు మిల్లర్లు దిగివస్తున్నారు. డిఫాల్టర్లుగా గుర్తించిన వారికి ధాన్యం జీరో అలాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో వారిలో వణుకు మొదలైంది. దీంతో చాలామంది మిల్లర్లు ముందుకు వచ్చి తమ తప్పులను ఒప్పుకొని ఫైన్లు కట్టడానికి సిద్ధమవుతున్నారు. అక్రమార్కులను సహించబోమని, మెరుగైన మిల్లింగ్ చేసి రైస్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్​ చేసే మిల్లర్లను ప్రోత్సహిస్తామని సర్కారు స్పష్టం చేస్తున్నది. దీంతో ఇన్నాళ్లు గాడి తప్పిన మిల్లింగ్ వ్యవస్థ మళ్లీ ట్రాక్​పైకి వస్తున్నది.గత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కారు హయాంలో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. 

జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల మద్దతుతో కొందరు అక్రమార్కులు  వందల కోట్లు కొల్లగొట్టారు. మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యం కేటాయింపులు చేయించుకొని, సీఎంఆర్ బియ్యాన్ని పెద్ద ఎత్తున అమ్ముకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కారు పాత మిల్లింగ్ పాలసీల దుర్వినియోగాన్ని గుర్తించింది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సీఎంఆర్ నిబంధనలపై ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక మేరకు రాష్ట్రంలో సీఎంఆర్ కేటాయింపుల్లో నూతన సంస్కరణలు తీసుకొచ్చింది.

బ్యాంకు గ్యారంటీతోనే కేటాయింపులు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లుల్లో ప్రభుత్వం 2,263 మంది మిల్లర్లకు మాత్రమే క్లీన్ చిట్ ఇచ్చి సీఎంఆర్ కేటాయింపులు చేస్తున్నది. మిగతా 863 మిల్లర్లను డిఫాల్టర్ల జాబితాలో చేర్చి, వారికి ధాన్యం కేటాయింపులు పూర్తిగా నిలిపివేసింది. గత కొన్నేళ్లుగా అక్రమాలకు పాల్పడుతున్న వీరిని గుర్తించి, గత వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్క గింజ కూడా కేటాయించకుండా చెక్ పెట్టారు. బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే ధాన్యం కేటాయించేలా సంస్కరణలు తీసుకువచ్చారు. లీజ్ పేరుతో జరిగే మోసాలను అరికట్టేందుకు నో -డ్యూస్ సర్టిఫికెట్లు తప్పనిసరి చేశారు. 

ఎలాంటి అవకతవకలకు పాల్పడని మిల్లర్లకు 10% బ్యాంక్ గ్యారెంటీ, అసలు చెల్లించి పెనాల్టీ చెల్లించిన వారికి 20%, అసలు 100% చెల్లించి పెనాల్టీ చెల్లించని వారికి 25% గ్యారెంటీ అమలు చేస్తున్నారు. సర్కారు కఠిన నిబంధనలతో మిల్లర్లు ఒక్కొక్కరూ దారికి వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బ్యాంక్ గ్యారెంటీ చెల్లించేందుకు మిల్లర్లు ముందుకు వస్తున్నారు. 

డిఫాల్టర్లను పక్కనపెట్టి, గ్యారెంటీ ఇచ్చిన వారికే అధికారులు ధాన్యం కేటాయిస్తున్నారు. కాగా, డిఫాల్టర్ మిల్లర్ల నుంచి రావాల్సిన రూ.3,200 కోట్ల సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  రెవిన్యూ రికవరీ యాక్ట్ (ఆర్ఆర్ యాక్ట్)తో వసూలు చేసేందుకు సివిల్ సప్లయ్స్ అధికారులు చర్యలు చేపట్టారు. భారీగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగిస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు సీఎంఆర్ ఎగ్గొట్టిన మిల్లర్లు భయపడుతున్నారు. 

మొత్తం బకాయిల్లో ఇప్పటి వరకు రూ.1,281 కోట్లు రికవరీ అయ్యాయి. డిఫాల్టర్లు లక్షన్నర టన్నులకు పైగా రూ.600 కోట్ల విలువైన సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించారు. తాజాగా మరో 138 మిల్లర్ల నుంచి సివిల్​ సప్లయ్స్​ అధికారులు రూ.68 కోట్లు రికవరీ చేశారు. కొందరు డిఫాల్టర్లు తమ ఆస్తులను అమ్ముకునే ప్రయత్నాలను సర్కారు అడ్డుకున్నది.  దీంతో కరీంనగర్ జిల్లాలో అక్రమార్కులకు చెందిన పలు  మిల్లులు మూతపడ్డాయి.  ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ మిల్లర్ అక్రమాలకు పాల్పడి జైలుకు వెళ్లడం గమనార్హం.

అక్రమార్కులకు చెక్ పెట్టేలా  లీగల్​ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​ మార్గదర్శకాలు..

గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తూ బెదిరింపులకు పాల్పడే మిల్లర్లకు సర్కారు ముకుతాడు వేసింది. అక్రమ మిల్లర్లపై కొరడా ఝళిపిస్తున్న సర్కారు.. సివిల్​ సప్లయ్స్​ విభాగం నిబంధనల్లో ఉన్న లొసుగులతో తప్పించుకోకుండా జాగ్రతపడింది. తాజాగా సివిల్ సప్లయ్స్ లీగల్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ చర్యలతో మిల్లింగ్ వ్యవస్థలో పారదర్శకత పెరిగి, అక్రమాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.