ఇళ్లు కొనేవారికి ప్రభుత్వం గ్యారెంటీ

ఇళ్లు కొనేవారికి  ప్రభుత్వం గ్యారెంటీ

న్యూఢిల్లీ : ఎకనామిక్ స్లోడౌన్ ఎఫెక్ట్‌‌ గృహ రంగంపై కూడా బాగా ఉంది. ఎక్కడికక్కడ ప్రాజెక్ట్‌‌లన్నీ నిలిచిపోయాయి. ఇళ్లు కొనుక్కుందామని ఆలోచిస్తున్నా… ఇంటి రుణానికి మీరు అర్హులు కారంటూ బ్యాంక్‌‌లు చాలా మంది అప్లికేషన్లను రిజక్ట్ చేసేస్తున్నాయి. అయితే అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా.. సొంతింటి కలను ప్రజలకు సాకారం చేసేలా ప్రభుత్వమే చొరవ తీసుకుంటుంది. హౌసింగ్ లోన్‌‌కు అర్హులు కాని వారికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వబోతోంది. దీనికోసం ప్రత్యేకంగా ఫండ్‌‌ను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీంతో సాధారణ ప్రజలకు తేలికగా రుణం దొరికి సొంతింటి కల సాకారమవుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఒక సీనియర్ అధికారి చెప్పారు. హౌసింగ్ రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం రూపొందించబోతున్న ప్యాకేజీలో ఇది ఒక భాగమని పేర్కొన్నారు. దీంతో హౌసింగ్ సెక్టార్ అప్పుల భారం నుంచి బయట పడుతుందని, ఆగిపోయిన ప్రాజెక్ట్‌‌లు మళ్లీ జోరందుకుంటాయని, ఇళ్ల అమ్మకాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఫండ్.. ఎవరైతే సరియైన క్రెడిట్ రేటు లేకుండా.. బ్యాంక్‌‌ల లోన్‌‌కు అర్హులు అవ్వరో వారికి ఉపయోగపడుతుంది. లోన్స్‌‌కు అర్హత పొందినా తక్కువ వడ్డీ రేట్లకే రుణం లభించేలా కూడా ఈ గ్యారెంటీ సాయపడనుంది. ప్యాకేజీ కింద స్ట్రెస్డ్ అసెట్ ఫండ్‌‌ను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇది ఆగిపోయిన ప్రాజెక్ట్‌‌లను పూర్తి చేయడానికి సహకరించనుంది. తక్కువ ఫీజుకే  ఈ ఫండ్‌‌ నుంచి గ్యారెంటీ అందుబాటులో ఉంటుంది. ఈ ఫండ్ ద్వారా హౌసింగ్ మార్కెట్‌‌లోకి మరింత మంది కొనుగోలుదారుల్ని తీసుకురావొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికైతే హౌసింగ్ మార్కెట్‌‌లో ఇన్వెంటరీ చాలా ఉంది.

హౌసింగ్‌‌ను గాడిలో పెడితే..సిమెంట్, స్టీల్ జంప్

హౌసింగ్ సెక్టార్‌‌‌‌కు ప్రభుత్వం ప్యాకేజ్‌‌ను రూపొందిస్తోంది. దీనికోసం ఇప్పటికే హౌసింగ్ రంగంలోని ప్రతినిధులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్చలు జరిపారు. ఈ రంగాన్ని మళ్లీ గాడిన పెట్టడానికి హౌసింగ్, అర్బన్ మంత్రిత్వ శాఖలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. హౌసింగ్ రంగాన్ని గాడిన పెడితే.. సిమెంట్, స్టీల్ రంగాలు మెరుగవుతాయి. అంతేకాక ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. హౌసింగ్ ప్యాకేజ్‌‌ త్వరలోనే వస్తుందని సీతారామన్ కూడా చెప్పారు.

లిక్విడిటీ కొరతతో సమస్యలు

ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే స్ట్రెస్డ్ ఫండ్‌‌ను పూర్తి కాని ప్రాజెక్ట్‌‌లకు ఉపయోగించాలని రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, గృహ కొనుగోలుదారుల గ్రూప్‌‌లు కోరుతున్నాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ రంగాలకు లిక్విడిటీ కొరత ఏర్పడటంతో హౌసింగ్ రంగంలో డిమాండ్ తగ్గింది. లిక్విడిటీ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం, ఆర్‌‌‌‌బీఐ పలు చర్యలను తీసుకుంది. చాలా మంది బిడ్డర్లు కూడా ప్రాజెక్ట్‌‌ డెలివరీలను చేపట్టలేదు. దీంతో కూడా డిమాండ్ పడిపోయింది. హౌసింగ్, ఫైనాన్స్ రంగాన్ని పునరుద్ధరించడమే ప్రభుత్వం, ఆర్‌‌‌‌బీఐ ముందున్న ప్రధాన లక్ష్యాలు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌‌ కింద హోమ్ లోన్ సెక్యురిటైజేషన్ మార్కెట్‌‌ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం స్పాన్సర్ చేసే ఇంటర్‌‌‌‌మీడియేటర్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని ఆర్‌‌‌‌బీఐ నియమించిన ప్యానల్ తెలిపింది.

హౌసింగ్‌‌ సెక్టార్‌‌‌‌కు బూస్ట్…

  •    త్వరలోనే హౌసింగ్   సెక్టార్‌‌‌‌కు ప్యాకేజ్
  •    హౌసింగ్‌‌ సెక్టార్‌‌‌‌కు ఏర్పాటు చేయబోయే ఫండ్ ద్వారా రుణాలకు గ్యారెంటీ
  •    గృహ రుణాలకు అర్హులయ్యే బారోవర్స్‌‌ను పెంచడం
  •    క్రెడిట్ రేటింగ్‌‌ను మెరుగుపరచడం
  •     తక్కువ రేటుకే వడ్డీలు