ఆధార్ ఉంటే ఇన్‌స్టంట్ గా పాన్ కార్డు

ఆధార్ ఉంటే ఇన్‌స్టంట్ గా పాన్ కార్డు

ఇకపై పాన్ కార్డు కోసం ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. మీకు ఆధార్ కార్డు ఉన్నట్లయితే..  పాన్ నంబర్ వెంటనే వచ్చేస్తుంది. ఇందుకు సంబంధించి శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో (బడ్జెట్ 2020) ఓ ప్రకటన చేశారు. ప్రభుత్వం ఈజీ ప్రొసెస్ తో పాన్ కార్డును ఆధార్ ఉన్న ప్రతీ ఒక్కరికి అందజేయనుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు.  ఆధార్ కార్డు ఆధారంగా  ప్రభుత్వం ఓ కొత్త సిస్టమ్ ను ప్రవేశపెడుతుందని, దీంతో ఆధార్ కార్డు ఉన్న వ్యక్తులకు ఇన్‌స్టంట్ గా పాన్ కార్డు  కేటాయించడం జరుగుతుందని ఆమె చెప్పారు. ఈ ప్రొసెస్ వల్ల పాన్ కార్డు కోసం నెల రోజులు ఎదురుచూడాల్సిన బాధ తప్పుతుంది.