భద్రాచలం,వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం వైభవంగా జరిగింది. సుప్రభాత సేవ అనంతరం మూలవరులకు మంజీరా లు అద్ది తిరుమంజనం నిర్వహించారు. తర్వాత ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారలతో పంచామృతాభిషేకం వేదమంత్రోచ్ఛరణల మధ్య చేశారు. అభిషేకం తర్వాత స్వామికి విశేషహారతులు అందజేశారు. భక్తులకు మంజీరాలను పంపిణీ చేశారు.
ఆర్జిత సేవగా బంగారు పుష్పాలతో సువర్ణ పుష్పార్చన జరిగింది. బేడా మండపంలో స్వామికి కల్యాణం చేయగా, భక్తులు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నారు. సాయంత్రం దర్బారు సేవ నిర్వహించారు. హైదరాబాదుకు చెందిన కండ్లకుంట శ్రీకాంత్, నీలిమ దంపతులు శ్రీసీతారామచంద్రస్వామికి రాగిపై బంగారు పూత పూసిన 108 తులసీదళాలను విరాళంగా అందజేశారు. ప్రతీ శనివారం సీతారామయ్యకు గర్భగుడిలో సువర్ణ తులసీ దళ అర్చన జరుగుతుంది. వీటిని వినియోగించాలని వారు కోరారు.
