డీఎంహెచ్‌వోల నియామకానికి గ్రీన్​సిగ్నల్‌

డీఎంహెచ్‌వోల  నియామకానికి గ్రీన్​సిగ్నల్‌

    
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని ప్రతి జోన్‌కు ఒక మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(డీఎంహెచ్‌వో)ను నియమించేందుకు సర్కార్  గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ మొత్తానికి ఒక్కరే డీఎంహెచ్‌వో ఉండగా, మరో ఐదు డీఎంహెచ్‌వో  పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ గురువారం జీవో జారీ చేసింది. 

అదేవిధంగా కొత్తగా ఒక అడిషనల్‌ డైరెక్టర్‌, జాయింట్ డైరెక్టర్,  డిప్యూటీ డైరెక్టర్,  మూడు అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు,  నలుగురు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, ఆరుగురు ఆఫీస్ సూపరింటెండెంట్లు, 12 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు సైతం మంజూరు అయ్యాయి. 

కాగా, కొత్త జిల్లాలకూ డిస్ర్టిక్ట్​ మెడికల్,హెల్త్​ ఆఫీసర్​( డీఎంహెచ్‌వో)  పోస్టులను మంజూరు చేయాలని కేబినెట్​ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ పోస్టులపై సర్కార్ స్పష్టతను ఇవ్వలేదు.