గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ మృతి

గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ మృతి

గుడిమల్కాపూర్ కార్పొరేటర్, బీజేపీ నేత దేవర కరుణాకర్ అనారోగ్యంతో చనిపోయారు. నిన్న రాత్రి  ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యలు ఆయనను  బంజారాహిల్స్‌ లోని సిటీన్యూరో ఆసుపత్రిలో చేర్పించారు.  ఆస్పుపత్రిలో చేరిన కొద్దిసేపటికి కరుణాకర్ చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.  

దీంతో దేవర కరుణాకర్ పట్ల నివాళులు అర్పించేందుకు  ఆయన అభిమానులు, పార్టీ నేతలు హాస్పిటల్ వద్దకు చేరుకుంటున్నారు . కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. గుడిమల్కాపూర్ డివిజన్ నుంచి దేవర కరుణాకర్ మూడు సార్లు కార్పొరేటర్ గా గెలుపొందారు.  గతంలో ఆయన  కూతురు భవాని (29) కరోనాతో మృతి చెందారు. ఆమెకు భర్త కార్తీక్, ఓ బాబు ఉన్నాడు.