CNG వాహనదారులకు అదానీ టోటల్ గ్యాస్ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఇంధన ధరల సెగలు రేగుతుండగా.. అదానీ టోటల్ గ్యాస్ కూడా అదే బాట పట్టింది. కిలో సీఎన్జీపై రూ.1.50 రేటు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపుతో ఇప్పటివరకు రూ.82.27గా ఉన్న కేజీ సీఎన్జీ రేటు రూ.83.77 కు చేరుకుంది. ఈ కొత్త రేట్లు తక్షణమే అమల్లోకి రావడంతో వాహనదారులు బంకుల వద్ద రేటు పెంపుపై పెదవి విరుస్తున్నారు.
ఈ ధరల పెరుగుదల ప్రభావం సామాన్యుల నుంచి కమర్షియల్ వాహనాల వరకు అందరిపై పడనుంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలు చేసే ప్రైవేట్ కార్ల యజమానులతో పాటు.. ఆటో రిక్షా డ్రైవర్లు, టాక్సీ ఆపరేటర్లు ఈ పెంపుతో అసంతృప్తిగా ఉన్నారు. కిలోకు రూపాయిన్నర అంటే తక్కువగా అనిపిస్తున్నప్పటికీ నెలకు లెక్క వేస్తే డ్రైవర్ల ఆదాయంపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతుందని వాపోతున్నారు. దీనివల్ల ప్రయాణికులపై కూడా ఛార్జీల భారం పడే అవకాశం ఉంది.
ALSO READ : చిన్న ఇన్వెస్టర్లకు ఊరట..
అంతర్జాతీయ మార్కెట్‌లో నేచురల్ గ్యాస్ రేట్లలో వస్తున్న మార్పులు, సరఫరా ఖర్చులు పెరగడమే రేట్ల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే సీఎన్జీ ఇప్పటికీ కొంత చౌకగానే ఉన్నప్పటికీ.. ఇలా వరుసగా ధరలు పెంచుకుంటూ పోతే 'క్లీన్ ఫ్యూయల్' వైపు వెళ్లాలనుకునే వారికి నిరాశే మిగులుతోంది. అదానీ గ్యాస్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సామాన్యుడి ప్రయాణ ఖర్చులను పెంచనుందని నిపుణులు అంటున్నారు.
