GT vs RR : టాప్ లేపిన గుజరాత్ బ్యాట్స్మెన్.. రాజస్థాన్ ఏం చేస్తుందో.. 

GT vs RR : టాప్ లేపిన గుజరాత్ బ్యాట్స్మెన్.. రాజస్థాన్ ఏం చేస్తుందో.. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్ మెన్ రఫ్ ఆడించారు. రాజస్థాన్ బౌలర్లను చుక్కలు చూపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్ సాహా (4, 3 బంతుల్లో) మినమా గుజరాత్ లో మిగిలి ప్రతీ బ్యాట్స్ మెన్ రాణించారు. వచ్చిన బ్యాట్స్ మెన్ వచ్చినట్లు ఫోర్లు సిక్సర్లు బాదారు. 

ఓపెనర్ శుభ్ మన్ గిల్ (45, 34 బంతుల్లో) గుజరాత్ జట్టుకు శుభారంభాన్ని అందించాడు. మిడిల్ ఆర్డర్ లో వచ్చిన డేవిడ్ మిల్లర్ (46, 30 బంతుల్లో) రాజస్థాన్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. సాయి సుధర్శన్ (20, 19 బంతుల్లో), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (28, 19 బంతుల్లో), అభినవ్ మనోహర్ (27, 13 బంతుల్లో) క్రీజులో ఉన్నంతసేపు ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించారు.

రాజస్థాన్ బౌలర్లు కూడా చక్కడి బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. డాట్ బాల్స్ వేస్తూ గుజరాత్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్, జాంపా, చాహల్ కు చెరో వికెట్ దక్కింది.